పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన నటి స్వరాభాస్కర్, ఏం పేరు పెట్టిందంటే..?
ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ శేర్ చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్. తనకు ఆడపిల్ల పుట్టిందంటూ.. ఆనందంలో మునిగి తేలుతోంది.
బాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సాధించిన బ్యూటీ స్వర భాస్కర్. సోషల్ మీడియాలో ఎప్పుుడూ యాక్టీవ్ గా ఉందే ఈమె.. తాజాగా తన ఫ్యాన్స్ తో ఓ శుభవార్తను శేర్ చేసుకుంది. తాను తల్లి కాబోతున్నట్టు గతంలో ఫ్యాన్స్ కు శేర్ చేసిన బ్యూటీ... తాజాగా తనకు ఆడపిల్ల పుట్టిందంటూ.. ఆనంతంతో మరో పోస్ట్ పెట్టింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది స్వరా భాస్కర్. ఈ మేరకు తన భర్త ఫహాద్ అహ్మద్.. పాపతో కలిసి ఉన్న ఫోటోలు అయిన తరువాత భర్త తో కలిసి సంతోషాన్ని పంచుకుంది బ్యూటీ. భర్తతో సంతోషాన్ని పంచుకుని.. తనతో దిగిన ఫొటోలను స్వరభాస్కర్ ట్విటర్‌లో షేర్ చేసింది. అభిమానులతో ఈ విషయాన్ని శేర్ చేసుకుని సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది స్వర.
ఈ నెల 23న స్వారభాస్కర్ డెలివరీ అవ్వగా.. తమకు కూతురు జన్మించిందని ఆమె వెల్లడించింది. ఆమెకు రుబియా అనే పేరు పెడుతున్నట్టు తెలిపింది. స్వర దంపతులకు బిడ్డ జన్మించిన నేపథ్యంలో అభిమానులు వారికి ఇండస్ట్రీ నుంచి వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్పెషల్ గా పోస్ట్ లు కూడా పెడుతున్నారు.
స్వర భర్త ఫహాద్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ నేత. 2023 జనవరి 6న వీరు పెళ్లి చేసుకున్నారు. వీరు తొలుత కోర్టు ద్వారా రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మార్చిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. తాను తల్లిని కాబోతున్నట్టు మార్చిలో ఆమె ప్రకటించారు. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కొన్నిసార్లు మన ప్రార్థనలు అన్నీ ఫలిస్తాయి. భగవంతుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఇదొక గొప్ప అనుభూతి. ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం అంటూ అక్టోబర్ బేబీ పేరిట హ్యాష్‌ట్యాగ్ ఇస్తూ అక్టోబర్‌లో బిడ్డకు స్వాగతం పలుకబోతున్నట్లు ప్రకటించింది.