MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వాళ్ళే డబ్బులిచ్చి మరీ బాలీవుడ్ ని బాయ్‌కాట్‌ చేయిస్తున్నారు.. స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు

వాళ్ళే డబ్బులిచ్చి మరీ బాలీవుడ్ ని బాయ్‌కాట్‌ చేయిస్తున్నారు.. స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు

 బాలీవుడ్ బ్యూటీ  స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.  బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై ఆమె చాలా  సీరియస్ గా స్పందించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 04 2022, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటం, చిన్న చిన్న హీరోలతో పాటు..  స్టార్ హీరోలు కూడా  ఫెయిల్యూర్ బాట పడుతుండటంతో పాటు.. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు..  దీనికి తోడు బాయ్‌కాట్‌ బాలీవుడ్ ట్రెండ్ తో మరింత ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ విషయంలో స్పందించిన స్వర భాస్కర్ ఇది కావాలనే చేస్తున్నారంటూ కామెంట్స్ చేసింది. 

26

రీసెంట్ గా  స్వరభాస్కర్ ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై  సీరియస్ గా స్పందించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వర భాస్కర్ మాట్లాడుతూ..ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ ని కొంతమంది కావాలని చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ గ్యాంగ్ తయారయింది... డబ్బులు ఇచ్చి మరీ..  బాలీవుడ్ గురించి బాడ్ గా  ట్వీట్స్, ట్రోల్స్ చేయిస్తున్నారు అంటూ... సెన్సేషనల్ బాంబ్ పేల్చింది స్వర. 

36

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాంతో ఈ ప్రాచారంచేస్తున్నారు. ఇదంతా ప్రీప్లాన్డ్ గా జరుగుతుంది అంటుంది స్వర.  ఇదంతా ఆడియన్స్ చేసతున్నది కాదు.. కావలని చేయిస్తున్నదే అని ఆలోచిస్తే తెలుస్తుంది అన్నారు స్వరా బాస్కర్. 

46

ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ సినిమా వసూళ్ల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మాత్రం తెలీదు. సినిమాలు ఆడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బాయ్‌కాట్‌ బాలీవుడ్ ఒక్కటే కారణం కాదు. అయినా అందరూ ఫ్లాప్ అయిన సినిమాల గురించే మాట్లాడతారు. ఇదే సమయంలో గంగుబాయ్‌ కతియావాడి, భూల్‌ భూలయ్య-2 సినిమాలు హిట్‌ అయ్యాయి. వాటి గురించి ఎవరూ మాట్లాడట్లేదు ఎందుకు అని సీరియస్ గా ప్రశ్నించింది. 

56

బాయ్‌కాట్‌ బాలీవుడ్  పై  ఇప్పటికే చాలా మంది స్టార్లు స్పందించారు. కాని స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం బాలీవుడ్ లో స్పెషల్ గా నిలుస్తున్నాయి. ఈ వాఖ్యలు చేసినందుకు ఈమెని కూడా బాయ్‌కాట్‌ చేస్తారేమో అని కొంత మంది అభిప్రాయం వ్యాక్తం చేస్తున్నారు. ఈనెల 9న బాలీవుడ్  భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అయినా కాస్త మార్పు వస్తుందేమో చూడాలి. 

66

ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ  సినిమా వచ్చినా కొంతమంది నెటిజన్లు ఏదో ఒక కారణం చెప్పి బాయ్‌కాట్‌ బాలీవుడ్ అని ట్రెండ్ చేస్తున్నారు. సినిమాలు మాత్రమే కాదు.. అందులో యాక్టర్స్ ను కూడా బాయ్‌కాట్‌  చేస్తున్నారు.  ఇన్ని రోజులు ఈ వివాదంపై సైలెంట్ గా ఉన్న బాలీవుడ్ నటులు ఇప్పుడిప్పుడే దీనిపై నోరు విప్పుతున్నారు. కొంతమంది ఆర్టిస్టులు ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై విమర్శలు విసురుతూ సీరియస్ అవుతున్నారు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Recommended image2
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Recommended image3
Gangster Movies: OTTలో మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇవే..అసలు సిసలైన మజా గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved