- Home
- Entertainment
- Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
ఎన్టీఆర్, కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి లెజెండ్స్ చేయలేకపోయిన పాత్రని అల్లు అర్జున్ చేసి అదరగొట్టారు అని పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Allu Arjun
ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి లెజెండ్రీ నటులు ఎన్నో పౌరాణిక, చరిత్రాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణ దేవరాయులుగా నటించారు. ఏఎన్నార్ కాళిదాసుగా, తెనాలి రామకృష్ణుడిగా ఎన్నో చరిత్రాత్మక పాత్రల్లో మెప్పించారు. ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు ముగ్గురూ ఒక చరిత్రాత్మక పాత్రపై అప్పట్లో కన్నేశారు. ఈ విషయాన్ని సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఛానల్ లో తెలిపారు.
కృష్ణ కూడా ప్రయత్నించారు
గోన గన్నారెడ్డి పాత్రతో సినిమా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు. సాధ్యం కాలేదు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఆశపడ్డారు. వారికీ కుదర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం అనే మూవీ చేశారు. అందులో గోన గన్నారెడ్డి పాత్ర ఛాయలు ఉంటాయి కానీ పూర్తిగా ఆ పాత్ర కాదు. చరిత్రలో రుద్రమదేవికి గోనగన్నారెడ్డి నమ్మకస్థుడు, సామంతరాజు అని మాత్రమే తెలుసు. ఆ పాత్ర ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు.
తెలంగాణ మాండలికం
కానీ గుణశేఖర్ ఆ సినిమా కోసం, గోన గన్నారెడ్డి పాత్ర కోసం చేసిన హోమ్ వర్క్ ఆశ్చర్యపోయాం. నిజంగా అల్లు అర్జున్ ఆ పాత్రకు ఒప్పుకున్నాడు అంటేనే హ్యాట్సాఫ్ చెప్పాలి. అల్లు అర్జున్ ఈ సినిమాకి ఒప్పుకోవడం రుద్రమ దేవి సినిమాకి ఒక వరం అనే చెప్పాలి. ముందుగా గోనగన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ మాండలికంలో డైలాగులు రాయలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం తెలంగాణ మాండలికంలో డైలాగులు కావాలి అని అడిగారు.
ఆ పాత్రపై రీసెర్చ్
ఆ సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శివారెడ్డి నాకు ఫ్రెండ్. ఆయనకు ఫోన్ చేసి రుద్రమదేవి కాలంలో గోన గన్నారెడ్డి భాష ఎలా ఉండేది అని అడిగాను. వాళ్ళు రీసెర్చ్ చేసి కొంత ఆదోని, కర్నూలు భాష కలిసి ఉంటుంది. అని చెప్పారు. కానీ మేము వాళ్ళ సాయం తీసుకుని తెలంగాణ మాండలికంలో ఉర్దూ లేకుండా డైలాగులు రాశాం. అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు అంత బాగా పేలాయి అంటే విజిల్స్ కొట్టించాయి అంటే.. బన్నీ కష్టం కూడా ఉంది.
భార్య సాయం తీసుకున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తెలంగాణకు చెందిన అమ్మాయి. అల్లు అర్జున్ ఆమె సాయం కూడా తీసుకున్నారు అని పరుచూరి తెలిపారు. గుణశేఖర్ కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గమ్మునుండవయ్యా, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా లాంటి డైలాగులు అదరగొట్టేలా అల్లు అర్జున్ చెప్పారు. అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది.

