- Home
- Entertainment
- దాసరి పై కోపంతో స్క్రిప్ట్ పేపర్లు విసిరేసి వెళ్లిపోయిన ఎస్వీఆర్, చివరకు ఏమయ్యిందంటే..?
దాసరి పై కోపంతో స్క్రిప్ట్ పేపర్లు విసిరేసి వెళ్లిపోయిన ఎస్వీఆర్, చివరకు ఏమయ్యిందంటే..?
దాసరి నారాయణరావు అన్న మాటకు హర్ట్ అయ్యి.. ఎస్వీ రంగారావు స్క్రిప్ట్ పేపర్లు విసిరేసి వెళ్ళిపోయిన సంఘటన ఒకానొక టైమ్ లో జరిగిందట. ఇంతకీ దాసరి ఏమన్నారు..?
- FB
- TW
- Linkdin
Follow Us

ఎస్వీ రంగారావు అంటే ఇండస్ట్రీలో ఓ భయం ఉండేది అప్పట్లో. ఎందుకుంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటివారు కూడా ఎస్వీఆర్ కు భయపడేవారు. ఆయన ముందు ఉంటే డైలాగ్ చెప్పడం అదో అగ్నిపరీక్ష. ఆయన సెట్ లో ఉంటే ఎవరైనా గజగజా వణకాల్సిందే. ఇక ఆయనన్ను డైరెక్ట్ చేయాలి అంటే పెద్ద పెద్ద దర్శకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారట. ఒళ్ళు దగ్గర పెట్టుకునిప్రవర్తించేవారట.
Also Read: 400 కోట్ల లెక్కలు టార్గెట్, దిల్ రాజు పై ఐటీ దాడులకు కారణం అదేనా..? రిజల్ట్ ఏంటి..?
Thatha manavadu
అలాంటి ఎస్వీఆర్ ను తన ఫస్ట్ సినిమాలోనే డైరెక్ట్ చేయాల్సి వచ్చింది దాసరి నారాయణరావుకు. దాసరి దర్శకుడిగా పరిచయం అయిన సినిమా తాతా మనవడు. ఈ సినిమాలో కమెడియన్ రాజబాబు హీరోగా నటించారు. రాజబాబు తాతగా ఎస్వీఆర్ నటించారు. ఈసినిమా షూటింగ్ టైమ్ లో దాసరి, ఎస్వీఆర్ మధ్య చిన్న క్లాష్ వచ్చిందట. దాంతో స్క్రీప్ట్ పేపర్లు విసిరేసి ఎస్వీఆర్ వెళ్ళిపోయారట.
దానికి కారణం ఏంటంటే.. ఈసినిమాలో ఓ ఇంపార్టెంట్ సీన్ కోసం దాసరి ఓ 10 పేజీల డైలాగ్ ను రాశారట. ఆ డైలాగ్ ను దాసరి అసిస్టెంట్ అయిన రేలంగి నరసింహారావు వెళ్ళి ఎస్వీఆర్ కు వినిపించారట. దాంతో ఎస్వీఆర్ అందులో కటింగ్ లు చేసి.. మూడు పేజీలకు కుందించారట.
దాంతో విషయం తెలుసుకున్న దాసరి నారాయణ రావు. ఈసీన్ అలా ఉంటేనే బాగుంటుంది. సినిమా మొత్తానికి ఇదే హైలెట్.. ఇలా కట్ చేస్తే జీవం పోతుంది. ఈడైలాగ్ ముందు ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి..ఇలా కట్ చేయకండి. . మొత్తం చెప్పండి అని సున్నితంగా రిక్వెస్ట్ చేశారట.
దాంతో కోపంగా గర్జించిన ఎస్వీఆర్... దాసరిని తిడుతూ.. స్క్రీప్ట్ పేపర్లు విసిరేసి వెళ్లిపోయారట. ఆతరువాత కొంత సమయానికి ఆయన తిరిగి వచ్చి.. ఆ పదిపేజీల డైలాగ్ ను మననం చేసుకుని.. సింగిల్ టేక్ లోచెప్పారట. అంతే కాదు డైలాగ్ చాలా బాగుందని దాసరిని తెగ మెచ్చుకున్నారట ఎస్వీఆర్. భలేటోడివోయ్ డైరెక్టరు..మొత్తానికి నువ్వు అనుకున్నదే సాధించావ్ అని కితాబిచ్చారట ఎస్వీఆర్. అప్పట్లో షూటింగ్స్ లో జరిగే ఇంంటి సంఘటనలు భలే అనిపిస్తాయి. నేటి తరానికి మార్గదర్శకంగా కూడా నిలుస్తాయి.