స్టార్ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్.. కానీ అందరికీ లాభాలు, ఎక్కువ ఊహించుకోవడం వల్లే అంటూ డైరెక్టర్ కామెంట్స్
ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో రకమైన ఇమేజ్ ఉంటుంది. కొందరు మాస్ చిత్రాలు బాగా తెరకెక్కిస్తారు. కొందరు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించి మెప్పిస్తారు. కొందరు కామెడీ చిత్రాలు రూపొందిస్తారు. అలా తనకంటూ భిన్నమైన క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.
sv krishna reddy
ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో రకమైన ఇమేజ్ ఉంటుంది. కొందరు మాస్ చిత్రాలు బాగా తెరకెక్కిస్తారు. కొందరు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించి మెప్పిస్తారు. కొందరు కామెడీ చిత్రాలు రూపొందిస్తారు. అలా తనకంటూ భిన్నమైన క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. కుటుంబ కథా చిత్రాలకు హాస్యాన్ని జోడించి ఎన్నో చిత్రాల్లో ఆయన మ్యాజిక్ చేశారు.
SV Krishna Reddy
రచయితగా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్వీ కృష్ణారెడ్డి రాణించారు. చివరికి అలీ, వేణు మాధవ్ లాంటి వారిని కూడా హీరోగా పెట్టి అద్భుతాలు చేశారు. కానీ స్టార్ హీరోలతో ఆయన సరైన సక్సెస్ అందుకోలేదు. నందమూరి బాలకృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం టాప్ హీరో. సౌందర్య హీరోయిన్ గా నటించింది.
Top Hero Movie
కానీ ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఆ చిత్రం ఫ్లాప్ కావడంపై ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాప్ హీరో మూవీ ఫ్లాప్ అంటే తాను ఒప్పుకోను అని అన్నారు. ఎందుకంటే ఆ చిత్రంలో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి మంచి లాభాలు వచ్చాయి.
బాలయ్యతో నా కాంబినేషన్ లో ఫస్ట్ టైం సినిమా కాబట్టి హైప్ ఎక్కువైపోయింది. దీనితో సినిమా ఆడియన్స్ ఊహించుకున్నట్లు లేదు. కాబట్టి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ చిత్రంలో ప్రతి ఒక్క సాంగ్ సూపర్ హిట్ అయింది అని అన్నారు. ఆ చిత్రంలో ఎవరూ నష్టపోలేదని తెలిపారు.
Balakrishna
ఒక రకంగా టాప్ హీరో మూవీ హిట్ అయింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. అంచనాలు ఎక్కువ కావడం, ఎక్కువ ఊహించుకోవడం వల్ల బయట ప్రచారం మాత్రం ఫ్లాప్ అని జరిగినట్లు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.