తలక్రిందులవుతున్న అలియా కెరీర్, కోట్లల్లో నష్టం..!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో నిరసన జ్వాలలు రేపింది. ఆయన మరణానికి కారణం బాలీవుడ్ పెద్దలు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వారు ఎక్కువగా ద్వేషిస్తున్న వారిలో అలియా భట్ ఉండగా, వీరి తిరస్కరణ వలన ఆమె కెరీర్ బాగా డామేజ్ అయినట్లు కనిపిస్తుంది.
సుశాంత్ మరణం కారణంగా పుట్టిన నెపోటిజం వ్యతిరేక ఉద్యమం కొనసాగుతుంది. బాలీవుడ్ లో ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని, గాడ్ ఫాథర్స్ లేనివారిని ఎదగ కుండా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సుశాంత్ మరణానికి కారణం అనిభావిస్తున్న వారిపై సోషల్ మీడియా ద్వారా సుశాంత్ ఫ్యాన్స్ పగ తీర్చుకుంటున్నారు. సల్మాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, మహేష్ భట్ మరియు అలియా భట్ వంటివారిని వారు టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
దీని వలన సదరు సెలెబ్రెటీలకు ఎంతో కొంత నష్టం జరగకమానదు. సుశాంత్ మరణం నుండి పుట్టిన తిరస్కరణ భావజాలానికి ముఖ్యంగా యంగ్ హీరోయిన్ అలియా భట్ బలైపోయేలా ఉంది. ఈ సంఘటన తరువాత ఆమెపై తీవ్ర సోషల్ మీడియా దాడి మొదలైంది. కొన్నాళ్లుగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ వాడడమే మానేశారు.
ఇక దాదాపు నాలుగు నెలలు తరువాత అలియా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అది కూడా తన కొత్త చిత్రం సడక్ 2 ప్రమోషన్స్ కి సంబందించినవి. సడక్ 2 ట్రైలర్ కోసం ఎదురుచూసిన సుశాంత్ అభిమానులు విడుదలైన వెంటనే నెగెటివ్ ప్రచారంతో విరుచుకుపడ్డారు. మహేష్ భట్, అలియా భట్ పై తమకున్న కోపాన్ని డిజ్ లైక్స్ రూపంలో చూపించి వరల్డ్ రికార్డు నెలకొల్పారు.
సడక్ 2 ట్రైలర్ పై జరిగిన నెగెటివ్ ప్రచారం, తిరస్కరణ చూసిన తరువాత అలియాకు సినిమా అవకాశం ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు భయపడతారు అనిపిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా అలియా ఉండగా, ఇదే స్థాయిలో ఆమె చిత్రాలను ఒక వర్గం ప్రేక్షకులు తిరస్కరించినగా, బహిష్కరించినా సదరు చిత్రాల నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవు.
ఇక అనేక వ్యాపార ప్రకటనలకు అలియా భట్ ప్రచార కర్తగా ఉన్నారు. ఇకపై కార్పొరేట్ సంస్థలు ఆమెను బ్రాండ్ అంబాసడర్ గా నియమించుకోవడానికి వెనుకాడవచ్చు. అదే సమయంలో ఆమె బ్రాండ్ వాల్యూ కూడా చాలా వరకు పడిపోయే అవకాశం ఉంది. ఇది కూడా అలియా భట్ కు నష్టం కలిగించే అంశమే.
దర్శక నిర్మాతలకు ఆమె పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత కొన్ని ప్రఖ్యాత సర్వేల ద్వారా తెలుస్తుంది. ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ ప్రకటించిన 2019 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ ర్యాంకింగ్స్ అలియా భట్ ఏకంగా 12 స్థానానికి పడిపోయారు. గత ఏడాది ఆమెది 1వ స్థానం కాగా అది ఇప్పుడు 11 పాయింట్స్ నష్టపోయి 12కి చేరింది. కనీసం అలియా టాప్ టెన్ లో కూడా చోటు దక్కించుకోలేక పోయింది.
ఇవన్నీ గమనిస్తుంటే అలియా భట్ కెరీర్ ని సుశాంత్ డెత్ భారీగా డామేజ్ చేసింది అనిపిస్తుంది. మరి ఇలాగే కొన్నాళ్ళు కొనసాగితే ఆమె కెరీర్ ముగియడం ఖాయం. మరో ప్రక్క రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుండి అలియా తప్పించనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే అలియా మరింత నష్టపోతుంది.