మెగాస్టార్ తో నటించడం అదృష్టం అంటూనే.. భోళా శంకర్ కి ఆ కండిషన్ పెట్టిన సుశాంత్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఇక మిగిలింది థియేటర్స్ లో రచ్చ మాత్రమే.
రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో నటీనటులు వరుసగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో సుశాంత్ భోళా శంకర్ చిత్ర గురించి అనేక ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. సుశాంత్ ఈ చిత్రంలో కీర్తి సురేష్ కి పెయిర్ గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన వేదాళం కి రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికీ.. దర్శకుడు మెహర్ రమేష్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఛాన్స్ రాగానే సుశాంత్ చాలా ఎగ్జైట్ అయ్యారట. అంతే కాదు డైరెక్టర్ మెహర్ రమేష్ కి ఓ కండిషన్ పెట్టినట్లు కూడా సుశాంత్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన డ్యాన్సులని చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని. రెండుసార్లు చిరంజీవి గారి సినిమా షూటింగ్స్ కి కూడా వెళ్ళాను. ఇప్పుడు ఆయనతో కలసి నటించే అవకాశం రావడం అదృష్టం.
మెహర్ రమేష్ గారు భోళా శంకర్ గురించి చెప్పగానే చాలా నచ్చింది. ఇందులో తనకి ఒక సాంగ్ కూడా ఉందని అన్నారు. చిరంజీవి గారితో కలసి డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది ? వెంటనే నాకు కూడా ఆ సాంగ్ లో చిరుతో డ్యాన్స్ ఉండాలని మెహర్ రమేష్ కి కండిషన్ పెట్టినట్లు సుశాంత్ తెలిపారు. తప్పకుండా డ్యాన్స్ ఉంటుందని మెహర్ రమేష్ మాట ఇచ్చారు.
కాళిదాసు చిత్రంలో తమన్నా నాతో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ చిత్రంలో ఆమె బ్రదర్ గా నటిస్తున్నాను. చిరంజీవి గారు, తమన్నా, కీర్తి సురేష్ ముగ్గురితో నాకు కీలక సన్నివేశాలు ఉంటాయి. చిరంజీవిగారితో డ్యాన్స్ అంటే సెట్స్ కి రెండుగంటలు ముందుగానే వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడిని. చిరు మాత్రం మైండ్ లోనే స్టెప్ ని పట్టేసి వేసేవారు.
మెహర్ రమేష్ గారు ఈ చిత్రం కోసం మూడేళ్లు ట్రావెల్ చేశారు. చిరంజీవి గారిని కొత్తగా ప్రజెంట్ చేయాలని ఎంతో కష్టపడ్డారు. ఆయన కోసం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు సుశాంత్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్