సూర్య 23ఏళ్ళ తిరుగులేని కెరీర్.. కామన్ డీపీలు హల్చల్
సూర్య.. తమిళ సూపర్ స్టార్. తమిళ ప్రముఖ నటుడు శివ కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య ఇప్పుడు తమిళ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 23ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం.
సూర్య 1997లో `నేరుక్కు నెర్` చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు సూర్య. విజయ్ హీరోగా వసంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌లో సూర్య సెకండ్ హీరోగా నటించాడు. ఇది తెలుగులో `ముఖాముఖి`గా అనువాదమైంది. సెప్టెంబర్ 6న 1997లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. కానీ సూర్యకి నటుడిగా మంచి పేరొచ్చింది.
ఆ తర్వాత `కాదలే నిమ్మది` చిత్రంతో సోలో హీరోగా తానేంటో నిరూపించుకున్నారు. `పేరియన్` సినిమాతో కెరీర్ తొలి బ్రేక్ అందుకున్నారు. కమర్షియల్ చిత్రాలతోనే కాదు, `సెవెన్త్ సెన్స్`, `శివపుత్రుడు`, `గజిని`, `వేల్`, `24`, `బ్రదర్`, `సూర్య సన్నాఫ్ కృష్ణన్` వంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.
విభిన్న కథా నేపథ్య చిత్రాలతో హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సౌత్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగారు. అనేక ఆటుపోట్లని అదిగమిస్తూ తన విలక్షణ నటనతో ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి రేపటితో 23ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సందర్బంగా ఆయన 23ఏళ్ళ కెరీర్‌కి సంబంధించిన కామన్ డీపీలను విడుదల చేశారు. అభిమానులు, ప్రస్తుతం నటిస్తున్న `సూరారై పోట్రు`, `వాడి వాసల్` చిత్ర యూనిట్ నాలుగు కామన్ డీపీలను రిలీజ్ చేశారు. ఇందులో సూర్య కెరీర్లో బెస్ట్ చిత్రాలకు చెందిన పాత్రలను జోడించారు. ఈ సీడీపీలు విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.