పుష్ప 2 లో సమంత సర్ప్రైజ్ ఎంట్రీ! ఎక్కడో తెలిస్త మతిపోతుంది
పుష్ప 2 చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత కామెయో పాత్రలో కనిపించనుంది. ఈ సర్ప్రైజ్ ఎంట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. సుకుమార్ లక్కీ ఛామ్ గా భావించి సమంతను కామియోగా కనపడమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
![article_image1](https://static-gi.asianetnews.com/images/01jbthqcm938e1hts0gq3mk8vw/---6---2-_380x217xt.jpg)
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
తెరపై హఠాత్తుగా ఊహించని విధంగా కనపడే కామెయోలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాంటి సర్పైజ్ లు గురించి జనం మాట్లాడుకుంటారు. అందుకే దర్శక,నిర్మాతలు అప్పుడప్పుడూ తమ సినిమాల్లో అలాంటివి ప్లాన్ చేస్తూంటారు. అవి ఆ మేరకు సక్సెస్ అవుతూంటాయి కూడా.
ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో ఓ సర్పైజ్ ఎలిమెంట్ చోటు చేసుకోనుంది. ఓ స్టార్ హీరోయిన్ కామెయోని ప్లాన్ చేస్తున్నారు. థియేటర్ లో ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్?
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
సూపర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్ గా సెకండ్ పార్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ జనాల్లోకి వెళ్లిపోయాయి. అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ క్రమంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్పా -2 నిలిచింది. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి అప్డేట్స్, లీక్స్ లు వస్తూ జనాలను ఎంగేజ్ చేస్తున్నాయి.
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ తీర్చిదిద్దారు. కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో ‘పుష్ప ది రైజ్’ చిత్రీకరించారు. ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ‘పుష్ప ది రూల్’ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది.
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
ఇదిలా ఉంటే సుకుమార్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. పుష్పలోని 'ఊ అంటావా మావా సాంగ్' ఎంత హిట్ అయిందో చూశాం. ఇప్పుడు రాబోతున్న పుష్ప–2 లోను ఐటం సాంగ్ ను ప్లాన్ చేశాడు సుక్కు. ఈ ఐటెం సాంగ్ కోసం మేకర్స్, తెలుగు హీరోయిన్ శ్రీలీలని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది.
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
ఈ చిత్రంలో వచ్చే స్పెషల్ సాంగ్ లో సమంత కొద్ది క్షణాలు పాటు అలా కామెయోగా కనపడి దుమ్ము రేపనుంది. ఆమె స్టైల్ స్టెప్స్ వేసి సాంగ్ లోకు ఎంట్రీ ఇస్తుందని , మిగతా సాంగ్ ని శ్రీలీల కంటిన్యూ చేస్తుందని చెప్తున్నారు. సమంతను సుకుమార్ లక్కీ ఛామ్ గా భావించి కామియోగా కనపడమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సమంత సైతం వెంటనే ఓకే చెప్పి ఈ రోజు నుంచి షూట్ లో పాల్గొనబోతోందని వినికిడి.
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప-2’. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకోసం ఓ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించాల్సి ఉంది. కొంత మేర క్లైమాక్స్ షూట్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల చల్ చేస్తోంది.