MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karuppu OTT Release: వీరభద్రుడు (కరుప్పు) ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? డిలీటెడ్ సీన్స్‌ కూడా చేర్చబోతున్నారా?

Karuppu OTT Release: వీరభద్రుడు (కరుప్పు) ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? డిలీటెడ్ సీన్స్‌ కూడా చేర్చబోతున్నారా?

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష నటించిన వీరభద్రుడు (కరుప్పు) సినిమా థియేటర్లలో సూపర్ హిట్‌గా నడుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 19 2026, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వీరభద్రుడు ఓటీటీ రిలీజ్
Image Credit : X

వీరభద్రుడు ఓటీటీ రిలీజ్

సూర్య, త్రిష కలిసి నటించిన వీరభద్రుడు’ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో, దాని ఓటీటీ విడుదలపై కొత్త అప్‌డేట్స్ వచ్చాయి. మొదట్లో కొన్ని సాంకేతిక, ఆర్థిక సమస్యల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైనా, ఇప్పుడు అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌లో సూర్యతో పాటు త్రిష కృష్ణన్ కీలక పాత్ర పోషించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వీరభద్ర స్వామి పూజ..
Image Credit : X

వీరభద్ర స్వామి పూజ..

సామాజిక న్యాయం, న్యాయ వ్యవస్థలోని లోపాలు, వీరభద్రస్వామి పూజ వంటి అంశాలతో కూడినవీరభద్రుడు '(కరుప్పు) కథాంశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తమిళ సినిమాల ఓటీటీ రిలీజ్ గ్యాప్‌ను బట్టి చూస్తే, 'కరుప్పు' జూన్ రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై డ్రీమ్ వారియర్ పిక్చర్స్ గానీ, అమెజాన్ ప్రైమ్ గానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Related Articles

Related image1
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Related image2
Hyper Aadi: జబర్దస్త్ లవర్స్ కి పండగే, నాగబాబుకు మాటిచ్చిన హైపర్ ఆది, షాకింగ్ నిర్ణయం..
34
వీరభద్రుడు కలెక్షన్ల వేట
Image Credit : X

వీరభద్రుడు కలెక్షన్ల వేట

నిజానికి ఈ సినిమాను మే 14న ఉదయం స్పెషల్ షోలతో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఆర్థిక సమస్యలు, ప్రొడక్షన్ బకాయిల కారణంగా ఆ షోలు రద్దయ్యాయి. ఆ తర్వాత నటుడు సూర్య, నిర్మాత ఎస్.ఆర్. ప్రభు నేరుగా జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించినట్లు సమాచారం. దీంతో మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, మొదటి వారాంతంలోనే దాదాపు రూ.147 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

44
అన్‌కట్ వెర్షన్ తో కలిసి రిలీజ్..?
Image Credit : instagram

అన్‌కట్ వెర్షన్ తో కలిసి రిలీజ్..?

వీరభద్రుడు (కరుప్పు) చిత్రంలో నట్టి నటరాజ్, స్వాసిక, శివద, ఇంద్రన్స్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. సాయ్ అభ్యకర్ సంగీతం అందించగా, జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో యోగిబాబు, ఇన్‌స్టా ఫేమ్ సతీష్, దీప, వాటర్‌మిలన్ స్టార్ దివాకర్ వంటి చాలా మంది నటించినా, వారి సీన్లు సినిమాలో కనిపించలేదు. అందుకే, వారు నటించిన సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో జోడించాలని అభిమానులు కోరుతున్నారు. ఇది జరుగుతుందో లేదో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే
Recommended image2
Krrish 4 Update: రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న హృతిక్ రోషన్, ఇదెక్కడి అరాచకం బాబోయ్
Recommended image3
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Related Stories
Recommended image1
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image2
Hyper Aadi: జబర్దస్త్ లవర్స్ కి పండగే, నాగబాబుకు మాటిచ్చిన హైపర్ ఆది, షాకింగ్ నిర్ణయం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved