MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • రెట్రో కంటే ముందు సూర్య నటించిన టాప్ 5 ఓపెనింగ్ డే గ్రాసర్ సినిమాలు

రెట్రో కంటే ముందు సూర్య నటించిన టాప్ 5 ఓపెనింగ్ డే గ్రాసర్ సినిమాలు

సౌత్  సినిమా ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన స్టార్లలో సూర్య ఒకరు . ఈయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్‌ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధిస్తూ వస్తున్నాయి. తాజాగా ఆయన నటించిన "రెట్రో" మే 1, 2025న విడుదలై మంచి ఓపెనింగ్ సాధించింది. ఒక్క రోజు 17.75 కోట్లు వసూలు చేసింది.   ఈ నేపథ్యంలో "రెట్రో"కి ముందు సూర్య నటించిన టాప్ 5 ఓపెనింగ్ డే కలెక్షన్ సినిమాల జాబితా ఇది:  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 04 2025, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Actor Suriyas Kanguvas final collection report out

Actor Suriyas Kanguvas final collection report out

1. కంగువా (2024) – ₹22 కోట్లు
ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేశాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వంశ పరంపరల మధ్య జరిగే యుద్ధాల నేపథ్యంలో సాగుతుంది. బాబీ డెయోల్, దిశా పటానీని ఈ సినిమాతో సూర్య తమిళ తెరకు పరిచయం చేశారు. విశిష్టమైన విజువల్స్, భావోద్వేగాల మేళవింపు కారణంగా ఈ చిత్రం తొలి రోజే రూ.22 కోట్ల వసూళ్లను సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2. ఎన్.జీ.కే (2019) – ₹14.1 కోట్లు
సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో సూర్య రాజకీయ రంగంలోకి ప్రవేశించిన యువకుడి పాత్ర పోషించాడు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సూర్య స్టార్ పవర్‌ కారణంగా భారీ ఓపెనింగ్ వచ్చింది.

35

3. సింగం 3 (2017) – ₹13.5 కోట్లు
హరి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ద్వారా సూర్య ఈసిరిస్ లో మూడోసారి హిట్ కొట్టాడు. పోలీస్ ఆఫీసర్ మరోసారి అదరగొట్టాడు సూర్య.  రూరల్, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం మొదటి రోజే రూ.13.5 కోట్లు వసూలు చేసింది.
 

45

4. గ్యాంగ్  (2018) – ₹12.5 కోట్లు
విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హీస్ట్ కామెడీ సినిమాలో సూర్య దొంగగా నటించాడు.  తాను చేసే మోసాల ద్వారా అవినీతిని ఎదుర్కొనే వ్యక్తిగా కనిపించాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. ఫెస్టివల్  సీజన్‌లో విడుదలైన ఈ సినిమా కుటుంబ, యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

55
suriya 24

suriya 24

5. 24 (2016) – ₹10.3 కోట్లు
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో సూర్య మూడు పాత్రల్లో నటించాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం తెలివైన కథనంతో విమర్శకుల ప్రశంసలు పొందింది. అథ్రేయ అనే విలన్ పాత్రలో సూర్య నటన ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమాలన్నీ సూర్య కెరీర్‌లో ఓపెనింగ్ డే వసూళ్ల పరంగా మైలురాళ్లుగా నిలిచాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన సూర్య  'రెట్రో'  సినిమా 17. 75 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
అమరన్ ను అందుకోలేకపోయిన సూర్య, రెట్రో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Recommended image2
సూర్య చేతిలో అరడజను సినిమాలు, నెక్ట్స్ 5 ఇయర్స్ స్టార్ హీరో ఫుల్ బిజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved