MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూర్య, అమీర్ ఖాన్, లోకేష్ కనకరాజ్... కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో స్టార్స్ సందడి! వైరల్ ఫోటోలు 

సూర్య, అమీర్ ఖాన్, లోకేష్ కనకరాజ్... కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో స్టార్స్ సందడి! వైరల్ ఫోటోలు 

లోకనాయకుడు కమల్ హాసన్ బర్త్ డే వేడుకలు చెన్నైలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. 
 

Sambi Reddy | Updated : Nov 08 2023, 11:31 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Kamal Haasan

Kamal Haasan

నవంబర్ 7న కమల్ హాసన్ 69వ బర్త్ డే జరుపుకున్నారు. యూనివర్సల్ హీరో కమల్ కి వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. సోషల్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చెన్నైలోని తన నివాసంలో కమల్ హాసన్ గ్రాండ్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. 

28
Kamal Haasan birthday Party

Kamal Haasan birthday Party

కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో తారల సందడి నెలకొంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, సూర్య, లోకేష్ కనకరాజ్, కుష్బూ, కల్కి ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, మణిరత్నంతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. 

 

38
Kamal Haasan birthday Party

Kamal Haasan birthday Party

కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో సూర్య, అమిర్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూర్య, అమీర్ సెల్ఫీ దిగారు. ఈ ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇద్దరు గజినీలు ఒకే ఫ్రేమ్ లో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  సూర్య నటించిన గజినీ చిత్రాన్ని హిందీలో అమీర్ ఖాన్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 

48
Kamal Haasan birthday Party

Kamal Haasan birthday Party

కమల్ హాసన్ బర్త్ డే వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆయన జన్మదినం పురస్కరించుకొని రెండు మేజర్ అప్డేట్స్ వచ్చాయి. మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్న 234వ చిత్ర టైటిల్ అండ్ కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. మూడు దశాబ్దాల అనంతరం వీరిద్దరూ కలిసి మూవీ చేస్తున్నారు. థగ్ లైఫ్ అనే టైటిల్ నిర్ణయించారు. 
 

58
Kamal Haasan birthday Party

Kamal Haasan birthday Party


అలాగే కల్కి నుండి బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. దీనిపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో మొక్కుబడిగా పోస్టర్ వదిలారు. ఇది కమల్ హాసన్ ని అవమానించడమే అని అభిప్రాయపడ్డారు. 

68
Kamal Haasan birthday Party

Kamal Haasan birthday Party

భారతీయుడు 2 నుండి టీజర్ విడుదలైంది. 1996లో విడుదలైన భారతీయుడు అతిపెద్ద సంచలనం. అలాంటి బ్లాక్ బస్టర్ కి కొనసాగింపుగా వస్తున్న భారతీయుడు 2 టీజర్ మెప్పించింది. కమల్ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. 

78
Kamal Haasan birthday Party

Kamal Haasan birthday Party

కమల్ హాసన్ ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా సినిమాలు చేశారు. తన ఫ్యాన్స్ కి భిన్నమైన సినిమాలు అందించాలని అనేక ప్రయోగాలు చేశారు. కమల్ హాసన్ వేసినన్ని గెటప్స్ మరొక హీరో ట్రై చేసి ఉండడు అనడంలో సందేహం లేదు. 

 

88
Kamal Haasan birthday Party

Kamal Haasan birthday Party

పరిపూర్ణమైన నటుడు అనిపోయించుకోవడం కోసం కమల్ హాసన్ అన్ని క్రాఫ్ట్స్ పై పట్టు సాధించారు. కమల్ హాసన్ గొప్ప డాన్సర్, సింగర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడాను. ఆయన గత చిత్రం విక్రమ్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories