MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా, అలాంటి అంకుల్ కావాలి... సురేఖావాణి కూతురు సుప్రీత కామెంట్స్ వైరల్!

మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా, అలాంటి అంకుల్ కావాలి... సురేఖావాణి కూతురు సుప్రీత కామెంట్స్ వైరల్!

సురేఖావాణికి రెండో పెళ్లి చేస్తా అంటుంది కూతురు సుప్రీత. అందు కోసం మంచి అంకుల్ ని వెతికే పనిలో ఉందట. సుప్రీత క్రేజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 28 2024, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నటి సురేఖావాణి రెండో పెళ్లి వార్తలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. 2019లో సురేఖావాణి భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ క్రమంలో సురేఖావాణి రెండో వివాహం చేసుకుంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై సురేఖావాణి కూతురు సుప్రీత మండిపడింది. నిరాధార కథనాలు రాయకండి అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేసింది. కట్ చేస్తే అప్పుడప్పుడు సురేఖావాణి మ్యారేజ్, డేటింగ్ వంటి విషయాలపై ఓపెన్ అయ్యింది. పెళ్లి చేసుకోకపోయినా నచ్చిన వ్యక్తి నచ్చితే డేటింగ్ కి రెడీ అన్నట్లు ఆమె మాట్లాడారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

కాగా సుప్రీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. మీ అమ్మగారికి రెండో పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? అని యాంకర్ అడిగింది. దానికి అవును అని సుప్రీత అన్నారు. మా అమ్మకు మరో వివాహం చేయాలని అనుకుంటున్నాను. అయితే కుర్రాళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అమ్మకు అంకుల్స్ అయితే సెట్ అవుతారు. అమ్మను బాగా చూసుకునే, చెడు ఆలోచనలు లేని అంకుల్ దొరికితే పెళ్లి చేస్తాను. అలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్నాను అని చెప్పేసింది. 

 

35

గతంలో అమ్మకు రెండో పెళ్లి అంటే మండిపడిన సుప్రీత... ఈసారి ఆమె స్వయంగా వివాహం చేస్తానని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సుప్రీత హీరోయిన్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల పూజా కార్యక్రమాలు జరిపి గ్రాండ్ గా లాంచ్ చేశారు. 

45

సుప్రీతను హీరోయిన్ చేయాలి అనేది సురేఖావాణి కల. అది ఎట్టకేలకు నెరవేరుతుంది. సోషల్ మీడియాలో సురేఖావాణి, సుప్రీత చాలా పాప్యులర్. ఇంస్టాగ్రామ్ వేదికగా వీరు గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు చేస్తుంటారు. అవి వైరల్ అవుతుంటాయి. కూతురిని హీరోయిన్ చేయాలనే ఆలోచనతో సురేఖావాణి ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమెను పాప్యులర్ చేసింది. సుప్రీత ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని కూడా లక్షల మంది ఫాలో అవుతున్నారు. అప్పుడప్పుడు సుప్రీత ఫ్యాన్స్ తో చాట్ చేస్తుంది. 

 

55

ఇక హీరోయిన్ గా సుప్రీత ఈ మేరకు రాణిస్తుందో చూడాలి. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అంత ప్రోత్సాహం ఉండదు. అందులోనూ సురేఖా వాణి కూడా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతుంది. సుప్రీత హీరోయిన్ గా రాణించడం అంత సులభం కాదు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved