నమ్రతకు కోపం వస్తే ... మహేష్ బాబు పరిస్థితి ఏంటి..? సూపర్ స్టార్ ఏం చేస్తారో తెలుసా..?
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులే. అయితే వీరిలో ఎవరిది పై చేయి.. నమ్రతకు కోపం వస్తే.. సూపర్ స్టార్ ఏం చేస్తారు..? కాస్తా ఫన్నీగా అనిపించినా.. ప్రస్తుతం ఈ రూమర్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.
టాలీవుడ్ అన్యోన్య దంపతులు అంటే వెంటనే గుర్తుకు వచ్చే జంట చాలా మంది ఉన్నారు. కాని వెంటనే గుర్తుకువచ్చేవారు మాత్రం మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ దంపతులే.. ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా గుర్తింపు సాధించిన వీరిద్దరు వంశీ సినిమా టైమ్ లో ప్రేమించి పెళ్ళాడారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఇక ఈ జంట మాత్రం ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. నమ్రత కంప్లీట్ గా కుటుంబానికే పరిమితం అయ్యింది. పిల్లల ఆలనపాలన చూసుకుంటూ.. వారి చదువులు చూసుకుంటుంది. అటు మహేష్ కూడా సినిమాలు చేసుకుంటూ.. ఇల్లు షూటింగ్ తప్పించి.. పార్టీలు లాంటి వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. షూటింగ్ ఉంటే సెట్ కు వెళ్తాడు.. లేదుంటే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాడు.
అంతే కాదు ఫారిన్ షూటింగ్ అయినా సరే ఒక్కడు వెళ్లకుండా ఫ్యామిలీతో వెళ్తుంటాడు. ఖాళీ టైమ్ లో ఫ్యామిలీని తీసుకుని విదేశాలకు తిరుగుతుంటాడు. అలా బయట పార్టీలు కాని.. ఇతర ఫంక్షన్లు గాని.. ఫ్రెండ్స్ తో తిరగడం కాని.. అలావాటులేదు మహేష్ కు. ఇంట్లో కూడా నమ్రత మాటే చెల్లుబాటు అవుతుందట. బయట సూపర స్టార్ అయినా.. ఇంట్లో నమ్రతానే స్టార్ అంట..
భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏదో విషయంలో చిన్ని చిన్న గొడవలు కామన్ .. వీరి మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయట. ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారట. కొన్నిసార్లు నమ్రత మహేష్ బాబు చేసే పనుల పట్ల తనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారట.
నమ్రతకు కోపం వస్తే.. కోప్పడకుండా.. పోట్లాడకుండా.. మహేష్ బాబుతో ఏమాత్రం మాట్లాడకుండా.. షాపింగ్ కి వెళ్ళిపోతుందట. ఈ విధంగా నమ్రత మహేష్ బాబు పై కోప్పడిన తనతో గొడవ జరిగిన ఈమె షాపింగ్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తారట. అలా తన కోప్పాన్ని వదిలించుకుని ప్రశాంతంగా ఇంటికి వస్తుందట. ఇక మహేష్ బాబు కూడా ఈ విషయంలో ఏం మాట్లాడకుండా కామ్ గా ఉంటాడట. నమ్రత కూల్ అయిన తరువాతే.. ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడని తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈమూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.