- Home
- Entertainment
- ఎన్టీఆర్ `యుగంధర్`కి పోటీగా వచ్చి చావు దెబ్బ తిన్న సినిమాలివే.. కృష్ణ, మోహన్ బాబుకు చెమటలు
ఎన్టీఆర్ `యుగంధర్`కి పోటీగా వచ్చి చావు దెబ్బ తిన్న సినిమాలివే.. కృష్ణ, మోహన్ బాబుకు చెమటలు
ఎన్టీఆర్ హీరోగా నటించిన `యుగంధర్` మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంతో పోటీ పడి కృష్ణ, మోహన్ బాబు, మురళీ మోహన్ చిత్రాలు చావు దెబ్బతినడం విశేషం.

ఎన్టీఆర్ `యుగంధర్`తో పోటీ పడి డిజాస్టర్లుగా నిలిచిన చిత్రాలివే
సీనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగు సినిమాని ఉర్రూతలూగించారు. పౌరాణిక చిత్రాలతో అలరించడంతోపాటు ఆ తర్వాత సాంఘీక చిత్రాలు చేసి మెప్పించారు. కమర్షియల్ చిత్రాలతో బాక్సాఫీసుని షేక్ చేశాడు. అప్పట్లో ఎన్టీఆర్ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. అందులో ఒకటి `యుగంధర్` మూవీ. ఈ చిత్రంతో పోటీ పడ్డా సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయి. రామారావు దెబ్బకి డిజాస్టర్లుగా మిగిలాయి. కానీ ఒక్క మహేష్ బాబు మూవీ మాత్రం హిట్ కావడం విశేషం.
`యుగంధర్`తో రామరావు సంచలన విజయం
ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో `యుగంధర్` ఒకటి. యాక్షన్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రానికి కేఎస్‌ఆర్ దాస్ దర్శకుడు. ఇందులో ఎన్టీఆర్ కి జోడీగా జయసుధ నటించింది. ఇళయరాజా సంగీతం అందించారు. ఇది బాలీవుడ్‌లో వచ్చిన `డాన్` మూవీకి రీమేక్. తెలుగుకి తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు జోడించి రూపొందించారు. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ స్మగ్లర్‌గా నటించాడు. 1979 నవంబర్ 30న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే ఆల్ టైమ్ రికార్డుని సృష్టించింది. టోటల్ వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డుని సృష్టించింది.
`యుగంధర్`తో పోటీ పడి డిజాస్టర్ అయిన సూపర్‌స్టార్ `కెప్టెన్ కృష్ణ`
ఇక `యుగంధర్`తో పోటీ పడ్డ చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన `కెప్టెన్ కృష్ణ` ఉంది. `యుగంధర్` వచ్చిన వారం తర్వాత డిసెంబర్ 7న `కెప్టెన్ కృష్ణ` విడుదలైంది. ఈ చిత్రానికి కూడా కెఎస్‌ఆర్ దాస్ దర్శకుడు కావడం విశేషం. ఇందులో సూపర్ స్టార్‌తో శారద హీరోయిన్‌గా నటించింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. ఎక్కువగా వాటర్‌లో సాగే చిత్రమిది. సస్పెన్స్ డ్రామాగా రూపొందింది. ఇందులో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్‌గా నిలిచింది.
`యుగంధర్`తో చావు దెబ్బ తిన్న మోహన్ బాబు
డిసెంబర్ 7నే విడుదలైన మరో సినిమా `షోకిల్లా రాయుడు`. ఇందులో మోహన్ బాబు హీరో కావడం విశేషం. ఎస్‌డీ లాల్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్ బాబుతోపాటు నూతన్ ప్రసాద్, రావి కొండలరావు ముఖ్య పాత్రలు పోషించారు. సత్యం సంగీతం అందించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆడియెన్స్ ని అలరించలేకపోయింది. `యుగంధర్` దాటికి ఫస్ట్ డే నుంచే అడ్రస్ లేకుండా పోయింది.
తన మూవీతోనే ఎన్టీఆర్ పోటీ.. అడ్రస్ గల్లంతు
ఎన్టీఆర్ `యుగంధర్`కి వారం రోజుల ముందే(నవంబర్ 22న) `శృంగార రాముడు` చిత్రం విడులైంది. ఇందులోనూ ఎన్టీఆర్ హీరో కావడం విశేషం. లత హీరోయిన్‌గా నటించింది. రామారావు నటించిన డిఫరెంట్ చిత్రమిది. ఎక్కువగా రొమాంటిక్‌గా ప్లేబాయ్ తరహాలో ఉంటుంది. ఎన్టీఆర్‌ని ఆడియెన్స్ ఇలా చూడలేకపోయారు. ఇది హిందీలో వచ్చిన `కాశ్మీర్ కి కాలి`కి రీమేక్. అది పూర్తి రొమాంటిక్‌గా రూపొందింది. కానీ తెలుగులో కొంత యాక్షన్ జోడించారు. కానీ మన ఆడియెన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వారమే `యుగంధర్` తో సంచలనం సృష్టించారు. దీంతో ఆయన సినిమా దాటికే `శృంగార రాముడు` అడ్రస్ లేకుండాపోయింది.
మురళీ మోహన్‌కి కోలుకోలేని దెబ్బ
ఎన్టీఆర్‌తో పోటీ పడ్డ మరో చిత్రం మురళీ మోహన్ హీరోగా నటించిన `అల్లరి వయసు`. ఇది కూడా `యుగంధర్`కి వారం రోజుల ముందే(నవంబర్ 24)న విడుదలైంది. ఈ చిత్రానికి జగపతి రాజశేఖర్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ ఫిల్మ్స్ పతాకంపై వెంకట సుబ్బారావు, పీపీ అబ్దుల్లాలు నిర్మించారు. మురళీ మోహన్‌కి జోడీగా జయచిత్ర హీరోయిన్‌గా చేసింది. జేవి రాఘవులు సంగీతం అందించారు. కానీ ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. `యుగంధర్` దెబ్బకి మాయమైపోయింది. మురళీ మోహన్‌కి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. కానీ పాటలు కొంత వరకు ఆకట్టుకోవడం విశేషం.
ఎన్టీఆర్ పోటీ పడి హిట్ కొట్టిన మహేష్
ఇక ఎన్టీఆర్ `యుగంధర్`కి పోటీగా వచ్చి నిలబడ్డ ఒకే ఒక్క చిత్రం `నీడ`. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్ నారాయణ మూర్తి కీలక పాత్ర పోషించారు. కృష్ణ గెస్ట్ గా మెరిశారు. మురళీ మోహన్ మరో ముఖ్య పాత్ర పోషించారు. మహేష్ బాలనటుడిగా నటించిన తొలి చిత్రమిది. దాసరి నారాయణ రావు రూపొందించారు. రామినేని సాంబశివరావు నిర్మించారు. నవంబర్ 29న ఈ చిత్రం విడుదలైంది. మంచి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇది `యుగంధర్`తో పోటీపడి నిలబడటం విశేషం.