- Home
- Entertainment
- కృష్ణ ఆశ్చర్యపరిచే ఫుడ్ హ్యాబిట్స్ , షూటింగ్ లో మెనూ అడిగిమరీ ఎలా తినేవారో తెలుసా..?
కృష్ణ ఆశ్చర్యపరిచే ఫుడ్ హ్యాబిట్స్ , షూటింగ్ లో మెనూ అడిగిమరీ ఎలా తినేవారో తెలుసా..?
ఫుడ్ హ్యాబెట్స్ విషయంలో కృష్ణగారి తీరే వేరు. ఈ విషయం ఆయనతో జర్నీ చేసిన రచయితలు, కో ఆర్టిస్ట్ లు చాలా మంది చెప్తూంటారు. వాటిని ఓ సారి గుర్తు చేసుకుందాం. ఆయన్ని మరోసారి ఈ వంకనైనా స్మరించుకుందాం.

సాధారణంగా సినిమా వాళ్ళంతా తమ ఆహారపు అలవాట్లు విషయంలో చాలా కాన్షస్ గా ఉంటారు. ఎక్కువ,తక్కువలు చూసుకుంటూ తమ బరువుని పెంచకుండా ఉండే ఆహారాలకే ప్రయారిటీ ఇస్తారు. అది మొదటి తరం నటుల నుంచి ఉంది. కాకపోతే కాస్త తక్కువ. అందుకే వాళ్లు సినిమాల నుంచి తప్పుకోగానే లావు అవటం వంటివి జరిగేవి. ఇప్పుడంటే ప్రత్యేకంగా డైటీషన్స్, జిమ్ కోచ్ లను హీరోలు మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆ జనరేషన్ లో అలాంటివి లేవు. ముఖ్యంగా కృష్ణగారు వంటివారు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రయారిటీ ఇచ్చేవారు. అవేంటో చూద్దాం.
ఫుడ్ హ్యాబెట్స్ విషయంలో కృష్ణగారి తీరే వేరు. ఈ విషయం ఆయనతో జర్నీ చేసిన రచయితలు, కో ఆర్టిస్ట్ లు చాలా మంది చెప్తూంటారు. ఇదే క్రమంలో ఆయనతో గూఢచారి 117 వంటి చాలా సినిమాలకు పనిచేసిన రచయిత తోటపల్లి మధు..కృష్ణగారి ఫుడ్ హ్యాబెట్స్ విషయంలో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఆయనతో సుదీర్ఘ కాలం జర్నీ చేసిన ఆయన చెప్పిన మాటలు ఆసక్తికరం.
తోటపల్లి మధు ఏమంటారంటే..కృష్ణగారు చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన మాటలు గమ్మత్తుగా ఉంటాయి.మార్నింగ్ ఇంటినుంచి బయిలుదేరి టిఫిన్ వంటివి పూర్తి చేసుకుని వస్తారు. పదకొండు టైమ్ కు మన పెరుగు ఆవడ వాడు రాలేదా అని అడిగేవారు. అప్పట్లో షూటింగ్ లలో పెరుగు ఆవడ ఇచ్చేవారు. పైన బూందీ వేసి రుచిగా ఉండేది. ఒంటిగంట లంచ్ కు ఉదయంకు మధ్య గ్యాప్ లో ఇది ఇవ్వటంతో కృష్ణగారు ఈ ఐటం కోసం అడిగేవారు.
అలాగే ఒంటిగంట లంచ్ కు ఆయన వెళ్లేవారు.మూడుకు వచ్చేవారు. ఓ అరగంట మాట్లాడుతూ సున్నిండలు వాడు రావాలే అనేవారు. వచ్చాక అవి తినేవారు. మళ్లీ ఐదున్నరకు వీట్ దోస అని వేలు మణి హోటల్ నుంచి వచ్చేది.ఇవి మద్రాస్ స్టైల్స్. అప్పటి ప్రొడ్యూసర్స్ ఇవన్ని మెయింటైన్ చేసేవారు.ఫుడ్ అనేది టాప్ ప్రయారిటీగా ఉండేది.
ఇలా సాయింత్రం వీట్ దోస, మధ్యాహ్నం సున్నండలు, ఉదయం టిఫెన్, ఆ తర్వాత పెరుగు ఆవడ ఇలా ఎన్ని తిన్నా బ్రహ్మాండంగా ఉండేవారు. ఎక్కడా బరువు పెరిగేవారు కాదు. ఆయనది మంచి ఫిజిక్..అద్బుతంగా ఉండేవారు అని గుర్తు చేసుకున్నారు తోటపల్లి మధు. మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ మంచి–చెడ్ల అలవాట్లు ఆహారం విషయంలోనూ ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో మంచి వ్యాధి నిరోధకత సమకూరడం మనకు పైకి వెంటనే కనిపించకపోవచ్చేమో గానీ.. మంచి ఇమ్యూనిటీ రావడం తప్పక జరుగుతుందని కృష్ణగారు నమ్మేవారు.
పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయకపోవడం మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు. పగటివేళ మనం పొద్దున్న లేచాక... కనీసం ఐదు లేదా ఆరు గంటలు వ్యవధిలో ఆహారం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి జీవక్రియలకు అవసరమైన ఇంధనం అందుతూ ఉంటుంది. కానీ... మనమందరం సగటున దాదాపు ఎనిమిది గంటల పాటు నిద్రపోతుంటాం. అందుకే మన దేహ అవసరాలకూ, జీవక్రియలకూ భోజనం అందించాల్సినందున ‘బ్రేక్‌ఫాస్ట్’ తప్పనిసరి. పైగా ఉదయం మన రోజుమొదలు కాగానే ఆరోజంతా కావాల్సిన శక్తి (ఎనర్జీ)కి ప్రధాన వనరు ‘బ్రేక్‌ఫాస్ట్’. కాబట్టి ఇతర ఏ పూట భోజనంతో పోల్చినప్పటికీ ‘బ్రేక్‌ఫాస్ట్’ మాత్రం తప్పక తీసుకోవాలని కృష్ణగారు చెప్పేవారంటారు. ఆయన తూచా తప్పకుండా బ్రేక్ పాస్ట్ విషయంలో ఎలర్ట్ గా ఉండేవారని వినికిడి.
‘‘బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే భోజనం రాజభోజనంలా, మధ్యాహ్న భోజనం సామాన్యుడి భోజనంలా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటు’’ అని చెప్పేవారు ఆయన. పోషకాలన్నీ లభ్యమయ్యే సమతుల ఆహారం అని పనిగట్టుకుని ,లెక్కేసుకుని తీసుకోకపోయినా పళ్లు, అన్ని రకాల కూరగాయలుతో మన భోజనంలో ఉండాలని అభిప్రాయపడేవారు. అందుకు తగ్గట్లుగానే ఆయన భోజనం సాగేది.బాలెన్స్‌డ్ డైట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.
Super star krishna
నీళ్లు ఎక్కువగా తాగడం కూడా కృష్ణగారు చేసేవారు. అందుకే ఆయన ఎప్పుడూ షూట్ లో ప్రెష్ గా ఉండేవారంటారు. మన శరీరంలోని 75 శాతం కేవలం నీటినే కలిగి ఉంటుందనే మాట ఆయన నమ్మేవారు. ప్రతిరోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగడం అవసరంగా బావించి తీసుకునేవారు. మంచిగా ఉండే నీళ్లు..అదీ పుష్కలంగా నీళ్లు తాగుతుండటం అవసరం అనే వారు. మార్కెట్‌లో తేలికగా దొరకే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకునేవారు కాదు.సెట్ లో మిగతా వాళ్లు తింటున్నా..ఆయన ఆసక్తి చూపించేవారు కాదు.