- Home
- Entertainment
- అల్లు అర్జున్ మూవీలో రజనీకాంత్, సూపర్ స్టార్ పాత్ర ఇదేనా.. లెక్క 2 వేల కోట్ల నుంచి మొదలు ?
అల్లు అర్జున్ మూవీలో రజనీకాంత్, సూపర్ స్టార్ పాత్ర ఇదేనా.. లెక్క 2 వేల కోట్ల నుంచి మొదలు ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో 1800 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టారు. పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లే విజయం సాధించింది. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. బన్నీ తన తదుపరి చిత్రం అంతకి మించేలా ఉండాలని కోరుకుంటున్నాడు.

Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో 1800 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టారు. పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లే విజయం సాధించింది. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. బన్నీ తన తదుపరి చిత్రం అంతకి మించేలా ఉండాలని కోరుకుంటున్నాడు. బన్నీ ప్లానింగ్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.
ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పురాణాలకు సంబంధించిన భారీ కథపై కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీతో చిత్రం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి రోజుకొక న్యూస్ బయటకి వస్తుండడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. వాస్తవానికి ఈ చిత్రాన్ని అట్లీ.. సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ కారణాల వల్ల ఈ కాంబినేషన్ డ్రాప్ అయింది.
దీంతో అట్లీ అదే కథతో అల్లు అర్జున్ తో చిత్రం చేయబోతున్నారు. ఇది ఒక రకంగా క్రేజీ మల్టీస్టారర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అమరన్ చిత్రంతో సంచలనం సృష్టించిన శివకార్తికేయన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఒక సర్ప్రైజ్ అయితే మరో మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తారట. అట్లీ సల్మాన్ ఖాన్ తో ఈ చిత్రం చేయాలనుకున్నప్పుడు రజనీకాంత్ ని కూడా సంప్రదించారు. ఆ టైంలో డేట్లు అడ్జెస్ట్ అవుతాయో లేదో అని రజనీ సందేహం వ్యక్తం చేశారట.
సెకండ్ ఆప్షన్ గా కమల్ హాసన్ పేరు కూడా పరిశీలించారు. మొత్తానికి సల్మాన్ ఖాన్, అట్లీ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు బన్నీ, అట్లీ చిత్రానికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. రజనీకాంత్ ఈ మూవీలో అల్లు అర్జున్ తండ్రిగా నటిస్తారని అంటున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ కూలీ, జైలర్ 2 చిత్రాలని పూర్తి చేయాల్సి ఉంది. ఈ చిత్రాలు పూర్తయ్యాక బన్నీ, అట్లీ చిత్రంలో సూపర్ స్టార్ జాయిన్ అవుతారట. ఈ వార్త అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పుష్ప 2 1800 కోట్లు వసూలు చేసింది. కానీ అట్లీ, బన్నీ మూవీ వసూళ్ల లెక్క 2 వేల కోట్ల నుంచి మొదలవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.