నమ్రత సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ వైరల్... మెడలో మహేష్ కట్టిన తాళి చూశారా!
నమ్రతా శిరోద్కర్ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ వైరల్ గా మారింది. ఇంస్టాగ్రామ్ లో నమ్రత తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు. నమ్రత మెడలో మహేష్ కట్టిన తాళి మనం చూడవచ్చు.

Namrata Shirodhkar
మహేష్-నమ్రత టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. 17 ఏళ్ల వైవాహిక జీవితంలో వీరు గొడవపడ్డారన్న వార్త వినలేదు.
Namrata Shirodhkar
ఆ గొప్పతనం అంతా నమ్రతదే. ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సంప్రదాయంగా నమ్రత ఉంటారు.
Namrata Shirodhkar
ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.
Namrata Shirodhkar
మహేష్ ఎండోర్స్మెంట్స్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్యాపిల్లలలో ఫారిన్ ట్రిప్ కి చెక్కేస్తారు.
Namrata Shirodhkar
మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు, ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్ కి వెళతారు. ఇది ఆయన ఒక అలవాటుగా, సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. నెలల తరబడి సాగిన షూటింగ్ లో పడ్డ కష్టమంతా వెకేషన్ లో మర్చిపోతాడు.
వంశీ సినిమా షూటింగ్ లో నమ్రత-మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం.