- Home
- Entertainment
- హాలీవుడ్ హీరోలను తలదన్నేలా మహేష్ బాబు లుక్... ఉఫ్ రగిలిపోతుందంటూ నమ్రత బోల్డ్ కామెంట్!
హాలీవుడ్ హీరోలను తలదన్నేలా మహేష్ బాబు లుక్... ఉఫ్ రగిలిపోతుందంటూ నమ్రత బోల్డ్ కామెంట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటో షూట్ చేశారు. ఆయన ఆల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. భర్త లేటెస్ట్ లుక్ పై నమ్రత శిరోద్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Mahesh Babu
సర్కారు వారి పాట మూవీలో మహేష్ బాబు ఓ డైలాగ్ చెబుతారు... 'ఏమయ్యా కిషోర్ మనకు మ్యారేజ్ చేసుకునే వయసేమైనా వచ్చిందంటావా?' అని. ఆ డైలాగ్ నిజ జీవితంలో మహేష్ కి అప్లై అవుతుంది. ఐదు పదుల వయసుకు దగ్గరపడుతున్నా మహేష్ లో మార్పు లేదు. ఆయన స్టిల్ యంగ్ గా కనిపిస్తున్నారు. లవ్ స్టోరీలకు సరిపడే ఫిజిక్ కలిగి ఉన్నారు.
Mahesh Babu
అసలు మహేష్ వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే సందేహం కలుగుతుంది. ఆయన తాజా ఫోటో షూట్ చూస్తే ఎవరైనా మెస్మరైజ్ కావాల్సిందే. డెనిమ్ షర్ట్ ధరించి, గ్లాసెస్ పెట్టి ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో హీటు పుట్టించాడు. మహేష్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Mahesh Babu
కాగా మహేష్ హ్యాండ్సమ్ లుక్ పై భార్య నమ్రత శిరోద్కర్ రెస్పాండ్ అయ్యింది. ఉఫ్ అంటూ హాట్ ఎమోజీలు పోస్ట్ చేసింది. గుండెల్లో సెగలు పుట్టించేలా మహేష్ ఉన్నాడని ఆమె పరోక్షంగా చెప్పింది. మహేష్ లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.
Mahesh Babu
మరోవైపు మహేష్ గుంటూరు కారం చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. నిరవధికంగా ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. రెండు మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 2024 సంక్రాంతి కానుకగా గుంటూరు కారం విడుదల చేయనున్నారు.
Mahesh Babu
గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలోని మహేష్ లుక్ ఫ్యాన్స్ ని ఆకర్షించింది. ఊరమాస్ మహేష్ అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Mahesh Babu
నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇండియాలోనే భారీ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. మహేష్ కోసం జంగిల్ అడ్వెంచర్ స్టోరీ సిద్ధం చేసినట్లు ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. దాదాపు రూ. 800 కోట్ల బుడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ హీరోయిన్, హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారట. మహేష్ మూవీని రాజమౌళి రెండు మూడు భాగాలుగా తెరకెక్కించే ఆస్కారం కలదన్న ఊహాగానాలు ఉన్నాయి.