SVP Movie: మహేష్ బాబు టార్గెట్ 122 కోట్లు.. యుఎస్ లో కలెక్షన్స్ పరిస్థితి ఏంటి ?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు మాస్ లుక్ లో.. కామెడీ టైమింగ్ అదరగొడుతూ కనిపిస్తున్న చిత్రం ఇదే.
మరికొన్ని గంటల్లో మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలకు అంతా రెడీ అయిపోయింది. దీనితో మహేష్ అభిమానులలో కోలాహలం కనిపిస్తోంది. కరోనా తర్వాత సినిమాల పరిస్థితి కొంత మారింది. టాక్ బావుంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. లేకుంటే తీరిగ్గా ఓటిటిలో చూసుకోవచ్చులే అని సైలెంట్ ఐపోతున్నారు. టికెట్ ధరలు కూడా దీనికి ఓ కారణం.
ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి చిత్రాలకు మంచి టాక్ వచ్చింది కాబట్టి ప్రేక్షకాదరణ దక్కింది. టాక్ నెగిటివ్ గా వచ్చిన ఆచార్య సినిమా పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. ఇంత దారుణమైన కలెక్షన్స్ చిరంజీవి కెరీర్ లో ఎప్పుడూ ఉండి ఉండవు. ఈ పరిస్థితుల్లో విడుదలవుతున్న సర్కారు వారి పాట పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సర్కారు వారి పాట చిత్రంపై ఇప్పటికే సూపర్ పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ చిత్రం హిట్ గ్యారెంటీ అనే టాక్ వస్తోంది. ఇదిలా ఉండగా సర్కారు వారి పాట చిత్రానికి మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధికంగా రూ 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం ఏరియాలో ఈ చిత్ర హక్కులు రూ 36 కోట్లకు అమ్ముడయ్యాయి.
Mahesh Babu
సీడెడ్ లో 14 కోట్లు, ఉత్తరాంధ్రలో 13 కోట్ల బిజినెస్ జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా మంచి ధరకే ఈ చిత్ర హక్కులు అమ్ముడయ్యాయి. సో సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ టార్గెట్ 122 కోట్లు. సినిపై పాజిటివ్ బజ్ ఉండడం, ట్రైలర్ అదిరిపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.
Mahesh Babu
యుఎస్ లో మహేష్ సినిమాలకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. సర్కారువారి పాట చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 650000 డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ అందుకోబోతోంది. సర్కారు వారి పాట చిత్రం సృష్టించబోయే రికార్డ్ ఓపెనింగ్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.