మహేష్ కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్న రాజమౌళి, జక్కన్న కసరత్తు మామూలుగా ఉండదుకదా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై కసరత్తులు చేస్తున్నాడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేశాడట. ఈ సినిమా బడ్జెట్ పై కూడా కసరత్తు మొదలెట్టినట్టు తెలుస్తోంది. జక్కన్న ఇంతకు ముందు సినిమాలను మించి ఇది ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా సర్కారువారి పాట సినిమాతో మంచి సక్సెస్ తో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా ఖాతాలో వేసుకున్నాడు సూప్ స్టార్ మహేష్ బాబు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న మహేష్ బాబు ఖాతాలో సర్కారువారి పాట సినిమా కూడా వచ్చి చేరింది. ఇక ఆతరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం రెడీ అవుతున్నారు మహేష్.
దాదాపు 11 సంవత్సరాల తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు సూపర్ స్టార్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీ ఓపెనింగ్ ఆ మధ్య గ్రాండ్ గా జరిగింది. త్వరలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఫారెన్ వెకేషన్ లో ఉన్న మహేష్.. రాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు.
కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ పని కూడా స్టార్ట్ అయ్యిందట. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తో సినిమా చేయబోతున్నాడు. ఈసినిమాకు సబంధించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న జక్కన్న.. కాస్త రెస్ట్ తీసుకుని మహేష్ బాబు సినిమా పని స్టార్ట్ చేశాట. ఇప్పటికే మహేష్ సినిమా కోసం మాస్టర్ ప్లాన్ ను రెడీ చేశాటన రాజమౌళి. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో.. సహసాలతో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతే కాదు ఈమూవీకి సంబంధించిన పక్కా ప్రణాళికను కూడా రెడీ చేసినట్టు సమాచారం.
తన సినిమాలకు అంతకంతకూ బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ కోసం 450 నుంచి 500 కోట్ల వరకూ ఖర్చు చేశాడు. ఇక ఈసినిమాకు అంతకు మించి అన్నట్టగా.. 500 నుంచి 600 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ కే ఎక్కువగా ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈమూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి స్టార్ ను తీసుకోబోతున్నారట. దీపికా పదుకొనే, కృతీ సనన్ లాంటి మరికొంత మంది స్టార్ హీరోయిన్ల పేర్లు ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.