- Home
- Entertainment
- Mahesh Babu: కెరీర్ మొత్తంలో మహేష్ కి గూస్ బంప్స్ తెప్పించిన సీన్ అదొక్కటే.. అయినా దానికి మాత్రం ఒప్పుకోడు
Mahesh Babu: కెరీర్ మొత్తంలో మహేష్ కి గూస్ బంప్స్ తెప్పించిన సీన్ అదొక్కటే.. అయినా దానికి మాత్రం ఒప్పుకోడు
Mahesh Babu Career Best Scene : సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి చిత్రాలు మహేష్ కెరీర్ గ్రాఫ్ ని పెంచుతూ వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mahesh Babu
Mahesh Babu Career Best Scene: సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి చిత్రాలు మహేష్ కెరీర్ గ్రాఫ్ ని పెంచుతూ వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా మాస్ చిత్రాలు కోరుకుంటారని మహేష్ తెలిపారు. అయితే కొన్నిసార్లు క్లాస్ టచ్ ఉన్న చిత్రాలు కూడా చేయాల్సి వస్తుంది.
Super Star Krishna
శ్రీమంతుడు కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం. ప్రేక్షకులు అభిమానులు బాగా ఆదరించారు. నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఆ చిత్రం అని మహేష్ తెలిపారు. ఆ తర్వాత మహర్షి, భరత్ అనే నేను లాంటి కంప్లీట్ క్లాస్ మూవీస్ చేశాను. అయితే ఫ్యాన్స్ మాత్రం పక్కా మాస్ చిత్రాన్ని నా నుంచి చాలా కాలంగా మిస్ అవుతూ వచ్చారు. వాళ్ళ కోరిక సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తీరింది అని మహేష్ బాబు తెలిపారు.
అయితే తాను ఎంత పెద్ద సూపర్ హిట్ చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమాలని ఎగ్జైట్ అవుతూ చూడలేను. ఎందుకంటే నటించింది నేనే కాబట్టి మళ్ళీ ఆ చిత్రాన్ని నేనే చూడాలంటే ఆసక్తి ఉండదని మహేష్ తెలిపారు. ఫ్యాన్స్ కి నచ్చితే చాలు అనుకుంటా. కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఇంట్లో హోమ్ థియేటర్ లో చూశా. ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్ర రెఫెరెన్స్ తో ఒక సీన్ ఉంటుంది.
Mahesh Babu
ఆ సీన్ చూడగానే నాకు గూస్ బంప్స్ ఆగలేదు అని మహేష్ బాబు తెలిపారు. ఎంటైర్ కెరీర్ లో తనకి గూస్ బంప్స్ తెప్పించిన సన్నివేశం అదే అని మహేష్ బాబు తెలిపారు. కానీ నాన్నగారి అల్లూరి సీతారామరాజు చిత్రం కానీ ఇతర హిట్ చిత్రాలని కానీ రీమేక్ చేసే ఉద్దేశం తనకి ఏమాత్రం లేదని మహేష్ తేల్చేశారు. అవి క్లాసిక్స్.. వాటిని అలాగే ఉంచాలి అని అన్నారు.
Sarileru Neekevvaru
ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రానికి రెడీ అవుతున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో హాలీవుడ్ స్థాయిలో భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.