- Home
- Entertainment
- సూపర్ స్టార్ కృష్ణతో 40కి పైగా చిత్రాల్లో రొమాన్స్ చేసిన తర్వాత చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్
సూపర్ స్టార్ కృష్ణతో 40కి పైగా చిత్రాల్లో రొమాన్స్ చేసిన తర్వాత చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్
తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సూపర్ స్టార్ కృష్ణతో విజయ నిర్మల, జయప్రద విజయశాంతి లాంటి హీరోయిన్లు అత్యధిక చిత్రాల్లో నటించారు. అయితే జయప్రదకి మాత్రం ఒక రేర్ రికార్డ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కలసి 45 చిత్రాల్లో నటించారు.

Super Star Krishna
తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సూపర్ స్టార్ కృష్ణతో విజయ నిర్మల, జయప్రద విజయశాంతి లాంటి హీరోయిన్లు అత్యధిక చిత్రాల్లో నటించారు. అయితే జయప్రదకి మాత్రం ఒక రేర్ రికార్డ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కలసి 45 చిత్రాల్లో నటించారు. ఒక హీరోతో హీరోయిన్ అన్ని చిత్రాల్లో నటించడం జయప్రదకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాలేదు. జయప్రద పేరుపై ఉన్న అరుదైన రికార్డ్ అది.
అయితే జయప్రద కృష్ణ తో హీరోయిన్ గా 40 వరకు చిత్రాల్లో రొమాన్స్ చేసారు. మిగిలిన చిత్రాల్లో ఇతర పాత్రల్లో నటించారు. అందులో చెల్లెలి పాత్ర కూడా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద అన్నా చెల్లెళ్లుగా నటించిన చిత్రం అడివి సింహాలు. కృష్ణ, కృష్ణంరాజు కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది. ఇందులో కృష్ణకి హీరోయిన్ గా శ్రీదేవి.. కృష్ణంరాజుకు హీరోయిన్ గా జయప్రద నటించారు.
కృష్ణ, జయప్రద అన్నా చెల్లెళ్ళు అనే ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది. అప్పటి వరకు అందమైన జంటగా వీళ్ళిద్దరిని చూసిన అభిమానులు అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ చూసి జీర్ణించుకోలేకపోయారు. మొదట ఈ పాత్రకి జయప్రద అంగీకరించలేదట. కృష్ణ రిక్వస్ట్ చేయడంతో అయిష్టంగా జయప్రద ఆ పాత్రలో నటించారు.
1976లో కృష్ణకి జోడిగా జయప్రద తొలిసారి శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత వెండితెరపై వీరిద్దరిదీ తిరుగులేని పెయిర్ గా నిలిచింది. జయప్రద చాలా సందర్భాల్లో కృష్ణ గారిపై ప్రశంసలు కురిపించారు. తాను కెరీర్ లో ఎదిగానంటే అందుకు కారణం కృష్ణగారు అందించిన ప్రోత్సాహమే అని జయప్రద తెలిపింది.