MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 5: కెప్టెన్‌ షణ్ముఖ్‌, సంచాలక్‌ జెస్సీలను ఓ రేంజ్‌లో ఆడుకున్న సన్నీ.. చివరికి జైలు పాలు

Bigg Boss Telugu 5: కెప్టెన్‌ షణ్ముఖ్‌, సంచాలక్‌ జెస్సీలను ఓ రేంజ్‌లో ఆడుకున్న సన్నీ.. చివరికి జైలు పాలు

సన్నీ, మానస్‌లు బిగ్‌బాస్‌ హౌజ్‌ని హీటెక్కించారు. జెస్సీ సైతం రెచ్చిపోయాడు. సన్నీని దీటుగా ఎదుర్కొన్నాడు. గట్టిగా ఫైట్‌ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా తన నిర్ణయం సరైనదే అంటూ బల్లగుద్ది చెప్పాడు.

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 30 2021, 12:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బిగ్‌బాస్‌ తెలుగు 5.. 55వ ఎపిసోడ్‌ మరింత హీటెక్కింది. ముఖ్యంగా సన్నీ, మానస్‌లు బిగ్‌బాస్‌ హౌజ్‌ని హీటెక్కించారు. జెస్సీ సైతం రెచ్చిపోయాడు. సన్నీని దీటుగా ఎదుర్కొన్నాడు. గట్టిగా ఫైట్‌ చేశాడు.
కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా తన నిర్ణయం సరైనదే అంటూ బల్లగుద్ది చెప్పాడు. 54వ రోజు శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిన ఈ సంఘటనలు ఎపిసోడ్‌ని ఆసక్తికరంగా మార్చడంతోపాటు హౌజ్‌ని ఒక్కసారిగా
హీటెక్కించాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

శుక్రవారం ఎపిసోడ్‌లో ప్రధానంగా గురువారం జరిగిన ఫైనల్‌ కెప్టెన్సీ టాస్క్ గురించే చర్చ జరిగింది. ఈ టాస్క్ లో షణ్ముఖ్‌ విజయం సాధించి నెక్ట్స్ వీక్‌కి కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. జెస్సీ సంచాలకుడిగా ఈ ఫైనల్‌ టాస్క్ జరిగింది. అయితే జెస్సీ నిర్ణయం సరైనది కాదని సన్నీ, మానస్‌లు వాదిస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్‌లో వాళ్లు తరచూ దీనిపైనే చర్చించుకున్నారు. ఇతరులతోనూ ఇదే విషయాన్ని చర్చించారు. తప్పుగా గేమ్‌ జరిగిందని వాపోతున్నారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అసలైన ఆట ఇప్పుడు స్టార్ట్ అవుతుందని మానస్‌తో చెప్పాడు సన్నీ. 

39

అంతలోనే మానస్‌ మళ్లీ బిగ్‌బాస్‌ రూల్స్ ని తిరిగి చదివి వినిపించాడు. సంచాలక్‌ రూల్స్ ఫాలో కాలేదని తెలిపారు. సిరి పడిపోయినా దాన్ని పట్టించుకోలేదని తెలిపారు. షణ్ముఖ్‌, సిరిలకు ఫేవర్‌గా సంచాలక్ వ్యవహరించారి వారు ఆరోపించారు. ఇదే విషయంలో విశ్వ సైతం తాను మాట్లాడింది తప్పు అయితే సారీ అంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత మానస్‌, సన్నీ కూర్చొని మాట్లాడుకున్నారు. ఎప్పుడు ఎలా మాట్లాడో తెలియదని, అనవసరంగా గొడవలు పెట్టుకుంటావని సన్నీకి చెప్పాడు మానస్‌. కానీ ఇది రాంగ్‌ గేమ్‌ అంటూ సన్నీ వాదిస్తూనే ఉన్నాడు. 

49

మధ్యలో సరదాగా ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. ప్రియాంక నిద్ర పోయింది. దీంతో బిగ్‌బాస్‌ బజర్‌ మోగింది. కెప్టెన్‌ షణ్ముఖ్‌ ఆమెకి ఫనిష్‌మెంట్‌ వేసేందుకు బయలు దేరాడు. అయితే తనకు బ్యాక్‌ పెయిన్‌ ఉందని, అందుకే పడుకున్నానని చెప్పింది ప్రియాంక. కానీ షణ్ముఖ్‌ వినలేదు. ఆమెకి ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు. ఇది కాసేపు నవ్వులు పూయించింది. అయితే సన్నీ మాత్రం నిన్న టాస్క్ లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. దొంగలు హీరోలవుతున్నారు, వీరితో ఎలా ఉండాలంటూ ఒంటరిగానే స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద పడుకుని మాట్లాడుకుంటున్నాడు. తనని తాను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నానని, సంగీతం మాస్టర్‌ పాటలతో మ్యానేజ్‌ చేస్తున్నాడని శ్రీరామ్‌పై ఫైర్‌ అయ్యాడు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో స్కూల్‌ అంటూ తనలో తాను మాట్లాడుకున్నాడు. 
 

59

మధ్యలో మరో రిలీఫ్‌. తాజ్‌ మహల్‌ టీ పౌడర్‌కి సంబంధించి వచ్చిన పౌడర్‌ని కలుపుకుని టీ పెట్టుకుని ఆస్వాదించారు ఇంటి సభ్యులు. ఆ తర్వాత కాజల్‌తో సన్నీ ముచ్చటించారు. ఒకరు తన దృష్టిలో జీరో అయ్యారని, ఇకపై వాళ్లు ఏం మాట్లాడినా తనకు ఎక్కదని, వారిని నమ్మనని తెలిపారు. ఓ పాట కూడా పాడారు. నాగ్‌ సార్‌ ముందు అంతా అపరిచితుల్లాగా యాక్ట్ చేస్తున్నారని, తర్వాత అపరిచితుల్లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశాడు సన్నీ. మరోవైపు సిరి, షణ్ముఖ్‌ల మధ్య డిష్కషన్‌ జరిగింది. ఎట్టకేలకు కెప్టెన్‌ అయ్యావని సిరి అంటే పరిస్థితుల వల్ల కెప్టెన్‌ అయ్యానని షణ్ముఖ్‌ చెబుతాడు. 

69

మరోవైపు సన్నీ, మానస్‌, కాజల్‌ మరోసారి ముచ్చటించుకున్నారు. మనల్ని ఇలా చూస్తే త్రిమూర్తులు అంటారని చెబుతుంది. ఇప్పటికే ఉన్నారుగా, మనల్ని ఎందుకంటారని చెబుతాడు మానస్‌. అయితే కాజల్‌ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుందని, నెక్ట్స్‌ వీక్ నామినేషన్‌ లో ఉండకుండా చూసుకుంటుందని, సేఫ్‌ గేమ్‌ ఆడుతుందని శ్రీరామ్‌, రవి చర్చించుకున్నారు. ఇంతలో బిగ్‌బాస్‌ `వరస్ట్ పర్‌ఫెర్మర్‌` టాస్క్ ఇచ్చాడు. ఈ వారం వరస్ట్ పర్‌ఫెర్మెర్‌ చెప్పాలన్నారు. 
 

79

ఈ టాస్క్ హౌజ్‌ని మరింత హీటెక్కించింది. ఒక్కసారిగా గందరగొళానికి గురి చేసింది. ఇందులో సన్నీకి, కాజల్‌కి మూడు ఓట్లు వచ్చాయి. కెప్టెన్‌గా షణ్ముఖ్‌.. సన్నీని వరస్ట్ పర్ ఫర్మెర్‌గా నిర్ణయించారు. దాన్ని ప్రొటెస్ట్ చేశాడు సన్నీ. తనని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించాడు. నిన్నటి టాస్క్ విషయంలో సన్నీ చేసింది కరెక్ట్ కాదని, ఆయన ఫిజికల్‌గా వెళ్లాడని, అది తనకు నచ్చలేదని చెబుతాడు షణ్ముఖ్‌. 

89

దీంతో వివాదానికి మంట  పెట్టినట్టయ్యింది. తాను ఫిజికల్‌ చేయలేదని, మూవ్‌మెంట్‌ ఇచ్చానని వారించాడు సన్నీ. ఈ గొడవ తారా స్థాయికి చేరుకుంది. సంచాలకుడు సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపించాడు సన్నీ. దీంతో జెస్సీ కూడా లేచి తనని తాను ప్రొటెస్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు.  ఓడిపోయారని జెస్సీ అంటే.. ఓడించారని సన్నీ అంటాడు. ఇలా జెస్సీ, సిరి.. సన్నీ,మానస్‌ల మధ్య గొడవ పీక్‌లోకి వెళ్లింది.

99

మొత్తంగా సన్నీ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. జెస్సీకి, కెప్టెన్‌ షణ్ముఖ్‌కి చుక్కలు చూపించాడు. అయితే జెస్సీ కూడా  రెచ్చిపోవడం ఈ రోజు ఎపిసోడ్‌ మరో హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఏమాత్రం తగ్గేదెలే అనిపించుకున్నాడు. ఇలా శుక్రవారం ఎపిసోడ్‌ హాట్‌ హాట్‌గా జరిగింది. ఆడియెన్స్ కి కావాల్సినంత వినోదాన్ని పంచింది. అయితే ఫైనల్‌గా వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా సన్నీని నిర్ణయించి ఆయన్ని జైలుకి పాలయ్యారు. ఎంతగానో వాదించిన సన్నీ జైలుపాలు కావడం విశేషంగా చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved