- Home
- Entertainment
- 'మజాకా' ట్రైలర్ రివ్యూ.. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ధమాకా లాగా సైలెంట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ ?
'మజాకా' ట్రైలర్ రివ్యూ.. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ధమాకా లాగా సైలెంట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ ?
సందీప్ కిషన్, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ లో రూపొందిన మజాకా చిత్రం శివరాత్రి నుంచి థియేటర్స్ లో సందడి మొదలుపెట్టబోతోంది. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే.

Mazaka Movie Trailer
సందీప్ కిషన్, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ లో రూపొందిన మజాకా చిత్రం శివరాత్రి నుంచి థియేటర్స్ లో సందడి మొదలుపెట్టబోతోంది. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే. చాలా కాలంగా సందీప్ కిషన్ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మరో వైపు రీతూ వర్మ కూడా మంచి హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ కీలక పాత్రలో నటిస్తోంది. 20 ఏళ్ళ తర్వాత ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది.
Mazaka
రావు రమేష్ పాత్ర కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉండబోతోంది. తాజాగా మజాకా ట్రైలర్ లాంచ్ చేశారు. త్రినాథరావు గత చిత్రాల తరహాలోనే ఈ మూవీలో కూడా ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేశారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన అంశాలని సెటైర్లుగా ట్రైలర్ లో వాడారు. నీ లాంటి కొడుకు భూమండలం మొత్తం వెతికినా దొరకడు రా అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.
Mazaka
ట్రైలర్ లో వన్ లైన్ డైలాగులు బాగా పేలాయి. అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు అండి, పెగ్గు వేశాక సిగ్గేముంటుంది అండి అనే డైలాగు బావుంది. ట్రైలర్ లో చూపిన సన్నివేశాలు బట్టి చూస్తే కథలో ప్రధాన అంశం అన్షు అంబానీ చుట్టూ ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.
Sundeep Kishan
రావు రమేష్ కామెడీ హంగామా ఒక రేంజ్ లో ఉంది. హైపర్ ఆది కూడా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నాడు. ట్రైలర్ చివర్లో హైపర్ ఆది మాన్షన్ హౌస్ బాటిల్ ని హీరోకి ఇస్తూ ఇది బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకి అద్దుకుని తాగాలి అని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. మొత్తంగా మజాకా ట్రైలర్ చూస్తుంటే 100 పర్సెంట్ వినోదం గ్యారెంటీ అని అనిపిస్తోంది. అన్ని వర్కౌట్ అయితే ధమాకా తరహాలో త్రినాధరావు నుంచి మరో బ్లాక్ బస్టర్ పడొచ్చు.