కీర్తి రెడ్డి ఇప్పటికీ నన్ను తన ఫ్యామిలీ లాగే చూస్తుంది, ఒకే ఒక్క కారణం వల్ల విడాకులు..సుమంత్ కామెంట్స్
అక్కినేని ఫ్యామిలీ కి చెందిన సుమంత్ నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటన సుమంత్ సొంతం. అయితే కెరీర్ బిగినింగ్ లో ఉన్నన్ని హిట్స్ ఇప్పుడు సుమంత్ కి లేవు.
అక్కినేని ఫ్యామిలీ కి చెందిన సుమంత్ నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటన సుమంత్ సొంతం. అయితే కెరీర్ బిగినింగ్ లో ఉన్నన్ని హిట్స్ ఇప్పుడు సుమంత్ కి లేవు. సీతారామం చిత్రంలో ఆర్మీ అధికారిగా కీలక పాత్రలో నటించి మెప్పించారు. హీరోగా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు.
అయితే సుమంత్ వ్యక్తిగత విషయం కూడా అప్పుడప్పుడు వార్తల్లో ఉంటుంది. తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని సుమంత్ 2004లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడాదికే విభేదాలు వచ్చి వీళ్ళిద్దరూ విడిపోయారు. కీర్తి రెడ్డి మరో వివాహం చేసుకుని సెటిల్ అయింది. సుమంత్ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యారు.
ఇప్పట్లో తనకి మరో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని.. భవిష్యత్తులో చేసుకుంటానేమో తెలియదు అని అన్నారు. గత వివాహం వల్ల నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. నిజమే నేను, కీర్తి రెడ్డి విడిపోయాం. ఆమె ఫ్యామిలీ ఇప్పటికీ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగానే చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ నాతో ఆప్యాయంగా ఉంటారు. కీర్తి రెడ్డి కూడా అప్పుడప్పుడూ నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది.
తాతగారు మరణించినప్పుడు వచ్చి నన్ను కలసి వెళ్ళింది. ఆమెకి మంచి ఫ్యామిలీ దొరికినందుకు నాకు హ్యాపీ. మాకు పెళ్లైనప్పుడు మా ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేదు. మేం విడిపోవడానికి అదొక్కటే కారణం అని సుమంత్ తెలిపారు. మా ఇద్దరి జీవితం ఒకరకంగా సినిమా స్టోరీలా సాగింది అని సుమంత్ అన్నారు.
మ్యారేజ్ వ్యవస్థపై నమ్మకం ఉంది కానీ.. అది కొంతమందికి పనిచేస్తుంది.. కొంతమందికి పనిచేయదు అని సుమంత్ అన్నారు. కొంతమంది పెళ్లి చేసుకోకుండాఆ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అది మైండ్ సెట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది అని సుమంత్ తెలిపారు.