MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ‘పుష్ప 2’ సెట్ లో ఐ ఫోన్ విసిరికొట్టిన సుకుమార్? కోపానికి కారణం అదే

‘పుష్ప 2’ సెట్ లో ఐ ఫోన్ విసిరికొట్టిన సుకుమార్? కోపానికి కారణం అదే

కీలకమైన సీన్ అది. అప్పటికే 40 రీకేట్ లు అయ్యాయి. ఒకరు బాగా చేస్తే మరొకరు ఇబ్బందిగా చేస్తున్నారు.

4 Min read
Author : Surya Prakash
Published : Jun 27 2024, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111


తెలుగు పరిశ్రమలో మోస్ట్ రెస్పెక్టబుల్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరనే సంగతి తెలిసిందే. దర్శకుడుగా రాజమౌళి తర్వాత ఆ రేంజి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు ఆయనే  . తను తీసే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ, అదే సమయంలో కమర్షియల్ విలువలుని సినిమాలో మేళవిస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు. రాజమౌళిలా బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహా ఎపిక్ మూవీస్ తీయకపోయినా.. సుకుమార్‌కు ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉండటానికి అదే కారణం. కథల్లో, టేకింగ్‌లో ఆయన చూపించే వైవిధ్యమే ముఖ్య కారణం. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో చూపించిన సినిమాటిక్ బ్రిలియన్స్‌కు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సుకుమార్ తీసిన ‘పుష్ప’ సినిమా గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు అందరి దృష్టీ పుప్ప 2 పైనే ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211


 ఇక మూవీ లవర్స్  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa). ఈ  చిత్రం రీసెంట్ గా విడుదల వాయిదా పడింది. ఆగస్టు 15న రిలీజ్‌ చేయాల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు  ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అల్లు అర్జున్ సైతం ఈ విషయాన్ని షేర్ చేసారు.  అది ప్రక్కన పెడితే ఈ సినిమా  పెండింగ్ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే సుకుమార్ ఫెరపిక్షనిస్ట్ కావటంతో ప్రతీ సీన్, షాట్ జాగ్రత్తగాతీస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కోపతాపాలు చోటు చేసుకుంటాయి.

311


ప్రముఖ  ఆంగ్ల మీడియా లో వచ్చిన వార్త  మేరకు ఈ చిత్రం షూటింగ్ సమయంలో సుకుమార్ కోపంగా తన ఐ ఫోన్ ని నేలకేసి విసిరికొట్టారట. ఈ సీన్ కథలో వచ్చే సిండికేట్ మెంబర్స్ మీటింగ్. సినిమాలో వచ్చే కీలకమైన సీన్ అది. అప్పటికే 40 రీకేట్ లు అయ్యాయి. ఒకరు బాగా చేస్తే మరొకరు ఇబ్బందిగా చేస్తున్నారు. వారి ఫెరఫార్మెన్స్ లు సుకుమార్ ని సంతృప్తిపరచటం లేదు. ఈ క్రమంలో కోపం తెచ్చుకున్న సుకుమార్ ని ఎవరినీ ఏమీ అనలేకతన కాస్టలీ ఐ ఫోన్ ని నేల కేసి కొట్టి సెట్స్ నుంచి బయిటకు వెళ్లిపోయారట. 

411


సుకుమార్ పుష్ప 2 సినిమాని ఇండియాలో బెస్ట్ సినిమాగా తీర్చి దిద్దాలనుకుంటున్నారు. అందుకోసం అహోరాత్రాలు పనిచేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావటం లేదు. అందుకోసం రిలీజ్ డేట్ ని సైతం మార్చారు. తన టెక్నిషియన్స్, టీమ్ నుంచి ఆ మేరకు సపోర్ట్ కోరుకుంటున్నారు. అయితే కొందరు దానికి సహకరించకుండా ఆయన విజన్ కు తగినట్లే లేకపోవటమే ఆ కోపానికి కారణం అని తెలుస్తోంది. 
 

511

పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడం వల్ల  సుకుమార్ పై భారం ఎక్కువే పడిందని చెప్పాలి. దాంతో  ‘పుష్ప-2’కు కూడా బాగా హైప్ వచ్చింది. బిజినెస్ అలాగే జరిగింది. ఈ క్రమంలో   ఈ సినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  సుకుమార్ క్వాలిటీ విషయంలో రాజీ పడడని అందరికీ తెలుసు. స్క్రిప్టు తయారీ దగ్గర్నుంచి చాలా టైం తీసుకునే చేస్తారు. లెక్కలేనన్ని వెర్షన్లు రాయిస్తాడు. ఎక్కడిక్కడ ఫిక్స్ కాకుండా నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. ఆఖరి క్షణం వరకూ  సీన్, డైలాగులు మారుస్తాడని  చెప్తారు.   

611


విడుదలకు అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం ఇచ్చినా  సినిమా పూర్తి కాకపోవటానికి కారణం సుకుమార్ తను అనుకున్నది తెరపై వచ్చేదాకా కష్టపడే తత్వమే. మరో ప్రక్క ఆయనంటే గిట్టని వాళ్లు విపరీతంగా షూటింగ్ డేస్ వేస్ట్ చేసి ఇప్పుడు చెప్పిన ప్రకారం సినిమాను రిలీజ్ చేయలేని స్థితికి తీసుకొచ్చాడన్నది ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణ. ‘పుష్ప-2’ వర్కింగ్ డేస్ ఇప్పటికే 300 రోజులు దాటిపోయాయని చెప్తున్నారు. 

711


  సుకుమార్ ని సపోర్ట్ చేస్తూ మైత్రీ మూవీస్ నిర్మాతలు ... ‘‘పుష్ప 1’ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప 2’ని మరింత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నాం. నిర్విరామంగా పనిచేస్తున్నా ఇంకా చిత్రీకరణ మిగిలి ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కూ సమయం పడుతుంది. అందుకే ఆగస్టు 15న సినిమాని విడుదల చేయలేకపోతున్నాం. ఎన్నో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. మంచి క్వాలిటీతో చిత్రాన్ని మీకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది.
 

811


ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్  రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతోపాటు కొన్ని కీలక సీన్లను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం వచ్చిన (2021 డిసెంబరు 17) మూడేళ్లకు రెండో భాగం రానుండటం గమనార్హం. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం. అప్పటికీ   సుకుమార్ ప్లాన్ చేసి  మూడు యూనిట్ లుగా టీమ్ ని విడతీసి మరీ షూట్ చేస్తున్నారట.వాటిలో  రెండు యూనిట్లు రామోజీ ఫిలిం సిటీలో, ఒక యూనిట్ మారేడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నారని సమాచారం.  
   

911

ప్రస్తుతం  ‘పుష్ప ది రూల్’ భారీగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి.   యానిమల్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి (tripti dimri)బన్నీ తో కలిసి పుష్ప 2 కి సంబంధించిన  ఐటెం సాంగ్ లో  చిందులేయనుందని తెలుస్తోంది.  మాస్ ఐటెం సాంగ్ దేవి ఇచ్చాడని, థియోటర్స్ ఊగిపోతాయని అంటున్నారు. 
  

1011

పుష్ప 2 చిత్రానికి ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో భీబత్సమైన క్రేజ్ ఉంటుంది. అయితే హిందీ బెల్ట్ లలో మాత్రం ఇంకా క్రేజ్ మొదలు కాలేదు. ఫస్ట్ సాంగ్ డీసెంట్ గా రెస్పాన్స్ వచ్చిందని కానీ ఇనిస్టెంట్ ఛాట్ బస్టర్ కాలేదు. దాంతో ఇంకా అక్కడ పుష్ప 2 ఫీవర్ ప్రారంభం కాలేదు. అందుకోసం నిర్మాతలు ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఫీవర్ తగ్గింది కాబట్టి పుష్ప ఫీవర్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. 

1111


  
 పుష్పలో  ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.   అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు మేక‌ర్స్ .  ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image3
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved