MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుధీర్‌, రష్మి నుంచి ఇది కదా కావాల్సింది! వింటేజ్‌ రొమాన్స్ తో ఫ్యాన్స్ ట్రీట్‌ ఇచ్చిన జబర్దస్త్ జోడీ

సుధీర్‌, రష్మి నుంచి ఇది కదా కావాల్సింది! వింటేజ్‌ రొమాన్స్ తో ఫ్యాన్స్ ట్రీట్‌ ఇచ్చిన జబర్దస్త్ జోడీ

సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మి గౌతమ్‌ మళ్లీ కలిశారు. ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇచ్చాడు. వింటేజ్‌ సుధీర్‌ రష్మిలను ఆవిష్కరిస్తూ ఇది కదా మాకు కావాల్సింది అని ఫ్యాన్స్ చేత అనిపించుకుంటున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 12 2025, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సుడిగాలి సుధీర్‌, రష్మి గౌతమ్‌ జంటకి బుల్లితెరపై ఉన్న క్రేజ్‌ మామూలు కాదు. వీరిద్దరికి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. జబర్దస్త్ షో ద్వారా ఈ ఇద్దరు పాపులర్‌ అయ్యారు. ఇందులో తమ లవ్‌ ట్రాక్‌ నడిపిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్ షోకి హైప్‌ తీసుకొచ్చారు. రేటింగ్‌ని పెంచడంలో కీలకపాత్ర పోషించారు. వీరి కోసమే షో చూసే ఆడియెన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సుధీర్‌, రష్మి నిజంగానే ప్రేమించుకున్నారని అంతా నమ్మారు. ఈ ఇద్దరు కూడా షోలో లవ్‌ ట్రాక్‌లు నడిపించారు. లవ్ ఎక్స్ ప్రెస్‌ చేయడం, ప్రపోజ్‌లు, రొమాంటిక్‌ సాంగ్‌లతో డాన్సులు, స్టేజ్ పైనే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. నిజమైన లవ్‌ కపుల్స్ గా రక్తికట్టించారు.

అంతే బాగా తమ మధ్య కెమిస్ట్రీని పండించారు. దీంతో ఫ్యాన్స్ అంతా వీరు నిజంగానే లవ్‌ లో ఉన్నారని, ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే డిమాండ్‌లు వచ్చాయి. అయితే తాము మంచి ఫ్రెండ్స్‌ అని, ఫ్రెండ్‌కి మించిన రిలేషన్‌ అంటూ కవర్‌ చేసుకుంటూ వచ్చారు. 
 

35

అయితే గత రెండేళ్లుగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. సుధీర్‌ జబర్దస్త్ ని వదిలేశాడు. సినిమాల్లోకి వెళ్లారు. రెండు మూడు సినిమాలు చేశారు. కొన్ని ఆగిపోయాయి. దీంతో మళ్లీ బ్యాక్‌ అయ్యాడు సుడిగాలి సుధీర్‌. చాలా రోజులుగా ఆయన బుల్లితెరపై యాంకర్‌గానే రాణిస్తున్నారు.

ఈటీవీలో `ఫ్యామిలీ స్టార్స్` అనే షోని, `ఆహా`లో `సర్కార్‌ 4`లకు హోస్ట్ గా చేశాడు. కానీ రష్మి, సుధీర్‌ కలిసింది లేదు. దీంతో వీరిని ఫ్యాన్స్ చాలా మిస్‌ అవుతున్నారు. మళ్లీ కలవాలని, కలిసి షోస్‌ చేయాలని, పెళ్లి చేసుకోవాలనే డిమాండ్‌ చేస్తున్నారు.

read more: డైరెక్టర్లకి సారీ చెప్పిన రష్మిక మందన్నా.. గాయం గురించి చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్
 

45

ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకి మళ్లీ కలిశాడు. సంక్రాంతి స్పెషల్‌గా ఈ ఇద్దరు కలిసి షో చేశారు. ఇందులోకి సుధీర్‌ రీఎంట్రి ఇచ్చారు. గెస్ట్ గా మెరిసిన ఆయన పాత రోజులను గుర్తు చేశారు. ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరు మెలికలు తిరిగారు. రొమాన్స్ తో రెచ్చిపోయారు.

`తండేల్‌` సినిమాలోని బుజ్జితల్లి పాటకి స్టెప్పులేస్తూ పాత(వింటేజ్‌) సుధీర్‌, రష్మిలను చూపించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 
 

55

సంక్రాంతి పండగ స్పెషల్‌గా ఓ ప్రత్యేకమైన ఈవెంట్‌ని నిర్వహించింది ఈటీవీ. `ఈ సంక్రాంతికి వస్తున్నాం` పేరుతో ఈ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్‌ రావడం విశేషం.

ఆయనతోపాటు `సంక్రాంతికి వస్తున్నాం` టీమ్‌ అనిల్‌ రావిపూడి, ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ కూడా వచ్చి సందడి చేశారు. పూర్ణ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. హైపర్‌ ఆది చేసిన `పుష్ప2` స్ఫూఫ్‌ హైలైట్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన ప్రోమోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇది ఈ నెల 14న టెలికాస్ట్ కాబోతుంది. 

read more: విజయ్‌ 69 `భగవంత్ కేసరి` రీమేక్, అనిల్ రావిపూడికి షాకిచ్చిన కమెడియన్, దళపతికి ఎందుకు నో చెప్పాడు?

also read: హీరో వెంకటేష్‌పై కేసు నమోదు, హోటల్‌ వివాదంలో నాంపల్లి కోర్ట్ సీరియస్‌, ఏం జరిగిందంటే?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Kalki 2 Release Date: కల్కి 2 రిలీజ్‌ అయ్యేది అప్పుడే, ఏడాదంతా ప్రభాస్‌ సినిమాల ఫెస్టివల్‌
Recommended image2
Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved