- Home
- Entertainment
- సుధీర్ పరిస్థితి చివరికి ఇలా అయిపోయిందేంటి? .. అక్కడ దెబ్బకొట్టడంతో మళ్లీ ఈటీవీకి `జబర్దస్త్` కమెడియన్?
సుధీర్ పరిస్థితి చివరికి ఇలా అయిపోయిందేంటి? .. అక్కడ దెబ్బకొట్టడంతో మళ్లీ ఈటీవీకి `జబర్దస్త్` కమెడియన్?
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ షోని వీడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ బ్యాక్ రావడం, చివరికి ఆయన చేసే పరిస్థితి చూసి ఇతర కమెడియన్లు కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతుంది.

సుడిగాలి సుధీర్ టీవీ షోస్‌లో స్టార్ కమెడియన్ అనే విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. దీని కారణంతో ఆయన `జబర్దస్త్`ని వీడినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆయన అదే సమయంలో స్టార్ మాలో మరో షో చేయడంతో ఈటీవీకి, సుధీర్‌కి మధ్య విభేదాలు తలెత్తినట్టు వార్తలొచ్చాయి.
తనకు రెమ్యూనరేషన్ పెంచడం లేదని, స్టార్ మాలో ఎక్కువగా ఆఫర్ చేయడంతో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీని వీడినట్టు పుకార్లు ఊపందుకున్నాయి. కానీ ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉన్నట్టుండి ఈటీవీ షోలో సుధీర్ మెరవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అభిమానులను మాత్రం ఖుషి చేస్తుంది.
ఈటీవీ 27ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా `భలే మంచి రోజు` షో ప్లాన్ చేసింది ఈటీవీ. ఇందులో ఈటీవీకి సంబంధించిన ఆర్టిస్టులు, సినీ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు. ఆద్యంతం నిందుగా ఉందీ షో. తాజాగా విడుదలైన ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో సుడిగాలి సుధీర్ రీఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతుంది.
మరోవైపు పోసాని, సీనియర్ టీవీ నటి, హైపర్ ఆది, రాంప్రసాద్‌ల మధ్య జరిగే కామెడీ సన్నివేశాల సమయంలో `సర్ మనకు బ్రేక్ ఎప్పుడుంది` అని సుధీర్ అనగా, `నీకు మేము ఎప్పుడో బ్రేక్ ఇచ్చాడు. ఎందుకున్నావ్ ఇక్కడ నువ్వు` అంటూ వేసిన సెటైర్లు బాగా పేలాయి.
అనంతరం ఈటీవీలో పనిచేసే యాంకర్లతో ఓ స్పెషల్ స్కిట్ చేశారు. ఇమ్మాన్యుయెల్ పౌరసత్వం గురించి చెప్పిన డైలాగ్‌లు నవ్విస్తే, ఆ తర్వాత మరో యాంకర్ చెబుతూ, సుధీర్ ఫ్యాన్స్ అల్లరి తారా స్థాయికి చేరిందని, పందుల పెంపకం వీడియోల్లో కూడా వి వాంట్ సుధీర్ అని కామెంట్లు పెట్టడం విశేషం అని పేర్కొనగా షో దద్దరిల్లిపోయింది.
తర్వాత ఓ అమ్మాయితో కలిసి డాన్సు చేశాడు సుధీర్. ఆమెని ప్రేమించానని చెప్పే క్రమంలో బ్యాక్‌గ్రౌండ్ వేసిన గుర్రం సౌండ్ నవ్వులు పూయించింది. ఆ అమ్మాయి అన్నయ్య నేను ప్రేమించింది ఈయన్నే అని ఆదితో చెప్పగా, ఏం చూసి ప్రేమించావమ్మా వీడిని అనడం, సర్ ఇప్పుడు చాలా మారిపోయానని సుధీర్ చెప్పడం, పక్క ఛానెలా? అని ఆది పంచ్ వేయడంతో నవ్వులు విరిసాయి.
చివరికి కమ్ బ్యాక్ అయ్యాక మీరు ఏం చెప్పినా చేస్తాను సర్ అని సుధీర్ అనడంతో తన జుట్టు మర్దన చేయించుకున్నాడు ఇమ్మాన్యుయెల్. ఈ సందర్భంగానే `ఏ స్టేజ్‌కి వచ్చావబ్బా` అని ఇమ్మాన్యుయెల్ అనడంతో మరింతగా నవ్వులు పూసాయి. ఆ తర్వాత ఆది సైతం తన దైన స్టయిల్‌లో సుధీర్‌ని ఆటపట్టించడం విశేషం. ఈ షో ఈ ఆదివారం సాయంత్రం ఈటీవీలో ప్రసారం కానుంది. ప్రస్తుతం ప్రోమో ట్రెండ్ అవుతుంది. ఇటీవల సుధీర్ నటించిన `వాంటెడ్ పండుగాడ్` సినిమా పరాజయం చెందింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఈటీవీకి వచ్చేవాడని అంటున్నారు నెటిజన్లు.