MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sudheer:హీరో అయినా జబర్దస్త్ కమెడియన్ అంటూ కామెంట్స్.. సుధీర్ రియాక్షన్ ఇదే, 50 కథలు రిజెక్ట్ చేసి మరీ..

Sudheer:హీరో అయినా జబర్దస్త్ కమెడియన్ అంటూ కామెంట్స్.. సుధీర్ రియాక్షన్ ఇదే, 50 కథలు రిజెక్ట్ చేసి మరీ..

సుడిగాలి సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర. సుధీర్ తన కామెడీ బలాన్ని పక్కన పెట్టి ఎంచుకున్న చిత్రం ఇది. డిసెంబర్ 1న రణబీర్, సందీప్ ల యానిమల్ చిత్రంతో పాటు కాలింగ్ సహస్ర కూడా రిలీజ్ అయింది. 

Sreeharsha Gopagani | Published : Dec 06 2023, 11:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

సుడిగాలి సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర. సుధీర్ తన కామెడీ బలాన్ని పక్కన పెట్టి ఎంచుకున్న చిత్రం ఇది. డిసెంబర్ 1న రణబీర్, సందీప్ ల యానిమల్ చిత్రంతో పాటు కాలింగ్ సహస్ర కూడా రిలీజ్ అయింది. కానీ యానిమల్ హోరులో కాలింగ్ సహస్ర చిత్రం ఎక్కడా కనిపించలేదు. 

 

26
Asianet Image

పైగా ఈ చిత్రానికి కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూలు, టాక్ వచ్చింది. ఏమాత్రం లాజిక్ లేని సస్పెన్స్, యాక్షన్ అంశాలు వరుసగా ఈ చిత్రంలో వస్తూనే ఉంటాయి. ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో ప్రేక్షకుల సహనానికి ఈ చిత్రం పరీక్ష అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. తన బలాన్ని పక్కన పెట్టి సుధీర్ సీరియస్ కథని ఎంచుకోవడం తప్పు అనే విమర్శలు ఎదురవుతున్నాయి. 

 

36
Asianet Image

నిర్మాతలకు పూర్తిగా ఈ చిత్రం నష్టాలని మిగిల్చింది అనే టాక్ వినిపిస్తోంది. అయితే సుధీర్ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాలింగ్ సహస్ర గురించి అనేక విషయాలు ప్రస్తావించాడు. 50 కథలు రిజెక్ట్ చేసిన తర్వాత ఒకే చేసిన చిత్రం కాలింగ్ సహస్ర అని సుధీర్ పేర్కొన్నాడు. 

 

46
Asianet Image

గాలోడు చిత్రం తన మార్కెట్ పెరిగేలా చేసింది అని సుధీర్ అభిప్రాయ పడ్డాడు. ఆ చిత్రానికి నాకు చాలా ప్రశంసలు కూడా దక్కాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటిస్తే ఆడియన్స్ నన్ను ఆదరిస్తారా లేదా తెలుసుకోవాలనిపించింది. అందుకే కాలింగ్ సహస్ర చేశా. చూసినవారంతా నా పెర్ఫామెన్స్ ని మెచ్చుకుంటున్నారు అని సుధీర్ తెలిపాడు. 

 

56
Asianet Image

హీరో అయినప్పటికీ ఇంకా జబర్దస్త్ ట్యాగ్ అలాగే ఉంది. కొందరు జబర్దస్త్ కమెడియన్ అంటున్నారు. అలాంటి కామెంట్స్ ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించగా.. సుధీర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. జబర్దస్త్ ట్యాగ్ తో పిలిస్తే నాకు ఓకె. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 

 

66
Asianet Image

ఎందుకంటే నేను వచ్చింది అక్కడి నుంచే అని సుధీర్ సమాధానం ఇచ్చాడు. జబర్దస్త్ అనేది ఎప్పటికి నాతోనే ఉంటుంది. నాకు గుర్తింపు లభించింది దానితోనే కదా అని సుధీర్ తెలిపాడు. కాలింగ్ సహస్ర తీవ్రంగా నిరాశపరిచే ఫలితం ఇవ్వడంతో సుధీర్ ఇకపై ఎలాంటి కథలు ఎంచుకుంటాడు అనేది ఆసక్తిగా మారింది. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
సందీప్ రెడ్డి వంగా
 
Recommended Stories
Top Stories