- Home
- Entertainment
- రష్మికి తెలియకుండా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న సుడిగాలి సుధీర్.. తెరపైకి కొత్త అమ్మాయి.. వామ్మో ఇదేం ట్విస్ట్
రష్మికి తెలియకుండా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న సుడిగాలి సుధీర్.. తెరపైకి కొత్త అమ్మాయి.. వామ్మో ఇదేం ట్విస్ట్
యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ మధ్య ఉన్న ఎఫైర్ గురించి అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా కొత్త అమ్మాయిని పరిచయం చేశాడు సుడిగాలి సుధీర్. అంతేకాదు గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

`జబర్దస్త్` షో అంటూ యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ ల మధ్య కెమిస్ట్రీనే గుర్తొస్తుంది. వీరిద్దరు స్టేజ్‌పై పండించే రొమాన్స్ పీక్‌లో ఉంటుంది. ఈ కామెడీ షోకి హైప్‌ని తీసుకొస్తుంది. స్టేజ్‌పైనే చాలా సార్లు వీరిద్దరు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. డ్యూయెట్లు పాడుకున్నారు. చాలా సార్లు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. కానీ ఇదంతా గతం. స్కిట్‌లో భాగమని చెప్పిచ్చు.
ఇప్పుడు మాత్రం రష్మి అభిమానులకు, సుధీర్-రష్మి అభిమానులకు పెద్ద షాకే. ఎందుకుంటే ఇప్పటి వరకు రష్మి, సుధీర్‌లనే ఊహించుకున్నారు. ఈ జోడినే కావాలని కోరుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు. కానీ ఊహించిన విధంగా తెరపైకి కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఆమెని సుధీర్ మ్యారేజ్ చేసుకోవడం సంచలనంగా మారిపోయింది. సుధీర్.. రష్మినీ కాదని, మరో అమ్మాయిని ప్రేమించాడా? ఈ అమ్మాయి ఎవరూ అని ఆరా తీసేపనిలో పడ్డారు.
అయితే రష్మి లేని టైమ్‌లో, ఆమెకి తెలియకుండా సుడిగాలిసుధీర్ గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు ఇంద్రజ, హైపర్ ఆది వంటి వారు హాజరు కాగా సుధీర్ మ్యారేజ్ అత్యంత వైభవంగా జరిగింది. దానికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నెటిజన్లకి, రష్మి అభిమానులకు షాకిస్తుంది. అభిమానులే ఇంతగా ఫీల్ అవుతుంటే, ఇక రష్మి ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే రష్మి, సుధీర్ ఇప్పుడు కేవలం `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలోనే కనిపిస్తున్నారు. గతంలో `ఢీ`షోలోనూ వీరిద్దరు సందడి చేసేవారు. కానీ వారిని `ఢీ 14` సీజన్ నుంచి తొలగించారు. అయితే కెరీర్ పరంగా, సినిమాల పరంగా బిజీ అవుతున్న కారణంగా తాను `ఢీ` నుంచి తప్పుకుంటున్నట్టు అలాగే, `జబర్దస్త్` నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చాడు సుధీర్. కానీ ఆయన `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో మాత్రం సందడి చేస్తున్నారు. తనదైన కామెడీని పండిస్తున్నారు.
`ఢీ` షోని రష్మి, సుధీర్‌ల లవ్ స్టోరీ డామినేట్ చేస్తుందనే ప్రచారం జరిగింది. అందుకే వీరిని తొలగించారనే టాక్ కూడా వినిపించింది. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే సుధీర్ మాత్రం ఇప్పుడు `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో చేస్తున్నారు. ఈ షోకి ఆయనే యాంకర్. ఇతర కామెడీ షోలకు దీటుగా `శ్రీదేవి డ్రామా కంపెనీ` రన్ అవుతుంది. ఆదరణ పొందుతుంది. తాజాగా ఈ షోలోనే సుడిగాలి సుధీర్, మరో కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకోవడం విశేషం.
అయితే ఇది స్కిట్‌లో భాగంగానే చేశారనే టాక్ వినిపిస్తుంది. జనరల్‌గా ఈ షోలో చాలా సార్లు పెళ్లిళ్లు చేశారు. హైపర్ ఆది, వర్ష, ఇమ్యాన్యుయెల్ మ్యారేజ్‌లు చేశారు. అలానే ఇది కూడా అని అంటున్నారు. కానీ తెరపైకి ఇప్పుడు కొత్త అమ్మాయి కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. ఆ అమ్మాయి ఎవరు, ఈ రూపంలో సుధీర్ తాను చేసుకోబోయే అమ్మాయిని తెరకి పరిచయం చేస్తున్నారా? లేక ఇది జస్ట్ డ్రామా మాత్రమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ షోలో రష్మి ఉండదు. ఆమె లేని షోలో,ఆమెకి తెలియకుండా సుధీర్ మ్యారేజ్ జరగడం, పైగా ఎవరికీ తెలియని ఓ కొత్త అమ్మాయితో జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇందులో నిజమెంటో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. `శ్రీదేవి డ్రామా కంపెనీ` ఆదివారం మధ్యాహ్నం ఈటీవీ ప్రసారమవుతుంది. అయితే ఈ షో