MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబుకి ఇలాంటివి అసలు ఇష్టం లేదు, కానీ ఆయన కోసం సరెండర్.. సుధీర్ బాబు కామెంట్స్

మహేష్ బాబుకి ఇలాంటివి అసలు ఇష్టం లేదు, కానీ ఆయన కోసం సరెండర్.. సుధీర్ బాబు కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి చిత్రానికి సమాయత్తం అవుతున్నారు. ఆల్రెడీ రాజమౌళి గ్లోబల్ లెవల్ లో పాపులర్ అయ్యారు. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి వర్క్ ని మెచ్చుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 06 2024, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి చిత్రానికి సమాయత్తం అవుతున్నారు. ఆల్రెడీ రాజమౌళి గ్లోబల్ లెవల్ లో పాపులర్ అయ్యారు. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి వర్క్ ని మెచ్చుకున్నారు. రాజమౌళి తన తదుపరి చిత్రంతో గ్లోబల్ లెవల్ మార్కెట్ కి రీచ్ కావాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనితో మహేష్ బాబు చిత్రం కోసం జక్కన్న అంతర్జాతీయ స్థాయి టెక్నిషియన్స్ తో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే ఉత్కంఠ ఒకవైపు ఉంటే.. అసలు కథ ఏంటి, మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతోంది, లుక్ ఎలా ఉండబోతోంది అనే అంశాలు కూడా ఫ్యాన్స్ ని కుదురుగా ఉండనీయడం లేదు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు.. రాజమౌళి, మహేష్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 11 న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సుధీర్.. మహేష్, రాజమౌళి చిత్రం గురించి కామెంట్స్ చేశారు. 

35

మహేష్ బాబు తనకి తాను కొన్ని బౌండరీస్ పెట్టుకున్నారు. తన లుక్ విషయంలో మహేష్ కి చాలా నిబంధనలు ఉంటాయి. కనీసం లుంగీలో కనిపించడానికి కూడానా మహేష్ చాలా ఆలోచిస్తారు. ఇప్పుడిప్పుడే అది బ్రేక్ అవుతోంది. గుంటూరు కారం చిత్రంలో మహేష్ లుంగీ గెటప్ లో కనిపించిన సంగతి తెలిసిందే. 

45
Mahesh Babu

Mahesh Babu

అయితే మహేష్ బాబు తనకున్న బౌండరీలు మొత్తం రాజమౌళి కోసం బ్రేక్ చేసేశారు అని సుధీర్ బాబు అన్నారు. షర్ట్ విప్పి నటించాలన్నా, కండలు ప్రదర్శించాలన్నా మహేష్ కి ఇష్టం లేదు. అదే విధంగా పొడవుగా జుట్టు ఉండడం, ఎలాపడితే అలా గడ్డం పెంచడం కూడా మహేష్ కి ఇబ్బందే. కానీ ఇప్పుడు చూస్తేనేమో మహేష్ బాబు పొడవైన జుట్టు, గడ్డంతో గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు. 

55

ఇదంతా రాజమౌళి కోసమే. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళికి మహేష్ బాబు సరెండర్ అయిపోయారు. ఇన్నాళ్లు ఒక చట్రంలో ఉన్న మహేష్ దానిని బ్రేక్ చేశాడు అని సుధీర్ బాబు పేర్కొన్నారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం కనిపిస్తున్న పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్.. రాజమౌళి సినిమాలో ఇదే ఫైనల్ కాదు అని సుధీర్ బాబు అన్నారు. కంప్లీట్ గ్గా జుట్టు పెంచాక.. వర్క్ షాప్ నిర్వహిస్తారు. డిఫెరెంట్ స్టైల్ లో ట్రై చేస్తారు. ఏది బావుంటే ఆ లుక్ ఫైనల్ చేస్తారు అని సుధీర్ బాబు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Recommended image2
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved