- Home
- Entertainment
- దళపతి విజయ్ అభిమానులకు సుధా కొంగర వార్నింగ్, పరాశక్తి పై నెెగెటీవ్ ప్రచారం జరుగుతుందా?
దళపతి విజయ్ అభిమానులకు సుధా కొంగర వార్నింగ్, పరాశక్తి పై నెెగెటీవ్ ప్రచారం జరుగుతుందా?
పరాశక్తి సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ ఐడీల చాటున దాక్కుని దారుణమైన నెగటివ్ ప్రచారం చేస్తున్నారని దర్శకురాలు సుధా కొంగర ఆరోపించారు. విజయ్ అభిమానులపై ఆమె మండిపడ్డారు.

విజయ్ అభిమానులపై సుధాకొంగర ఫైర్
శివకార్తికేయన్ నటించిన 'పరాశక్తి' సినిమాపై జరుగుతున్న నెగటివ్ ప్రచారం గురించి దర్శకురాలు సుధా కొంగర స్పందించారు. విజయ్ దళపతి పేరు నేరుగా చెప్పకుండానే విమర్శించారు. ఫేక్ ఐడీల వెనుక దాక్కుని ప్రచారం చేస్తున్నారని, సినిమా రిలీజ్ చేసుకోలేని ఓ నటుడి అభిమానులే ఇదంతా చేస్తున్నారని, ఇదే తాము ఎదుర్కొంటున్న గూండాయిజం అని సుధా కొంగర అన్నారు. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధా ఇలా మాట్లాడారు.
ఫేక్ ఐడీల వెనుక దాక్కుని
"సినిమా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ఉంది. మీ సినిమా దానంతట అదే మాట్లాడితే సరిపోదు. సంక్రాంతికి ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నా. ఫేక్ ఐడీల వెనుక దాక్కుని దారుణమైన ప్రచారం చేస్తున్నారు. దీన్ని మనం ఎదుర్కోవాలి. ఇది ఒక నటుడి అభిమానుల నుంచి వస్తోంది. వాళ్ల అసమర్థత వల్ల సినిమాను విడుదల చేయలేకపోతున్నారు. ఇదే మేము ఎదుర్కొంటున్న రౌడీయిజం, గూండాయిజం," అని సుధా కొంగర అన్నారు.
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమా..
1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో 'పరాశక్తి' సినిమా తెరకెక్కింది. ఇందులో రవి మోహన్ విలన్‌గా నటించారు. హీరోగా చూసిన రవి మోహన్‌కు ఇది కొత్త కోణం. శ్రీలీలకు ఇదే తొలి తమిళ సినిమా. మొదట సూర్య, దుల్కర్‌తో 'పురనానూరు'గా ప్రకటించిన ఈ సినిమానే ఇప్పుడు 'పరాశక్తి'గా మారింది. ఇందులో బేసిల్ జోసెఫ్ కూడా అతిథి పాత్రలో నటించారు.
రిలీజ్ ఆగిపోయిన జననాయగన్
మరోవైపు, 'జన నాయగన్' సినిమాతో నటుడు విజయ్ సినిమాలకు దూరం కానున్నారు. ఇందులో బాబీ డియోల్, పూజా హెగ్డే, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరేన్, మమితా బైజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగదీష్ పళనిసామి, లోహిత్ ఎన్‌కే సహ నిర్మాతలు. ఈ సినిమా సెన్సార్ సమస్యల వల్ల విడుదల కాలేదు.

