Brahmamudi: కావ్య తప్పు చేసిందంటున్న సుభాష్.. తనలోని మరో కోణాన్ని చూపించి భర్తకి షాకిచ్చిన స్వప్న!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. భార్యలో మరో కోణాన్ని చూసి బిత్తర పోయిన ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కావ్యకి నిజం తెలిసినప్పుడు ఎందుకు ఎవరికీ చెప్పకుండా ఊరుకుంది. నా కొడుకు తనకోసం ఎంత చేశాడు,నన్ను సైతం ఎదిరించి తనకోసం పనిమనిషి పెట్టాడు, అలాగే ప్రతి చిన్న విషయానికి మీరు తనని సపోర్ట్ చేస్తారు అలాంటిది మీకు కూడా చెప్పలేదు. మావయ్య గారు కూడా కావ్య విషయంలో ఎంతో సపోర్ట్ గా ఉంటారు ఆయనకు కూడా విషయం చెప్పలేదు అంటే తను ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసింది.
ఇప్పటికైనా తన నిజ స్వరూపం తెలుసుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. మరోవైపు తప్పు చేసిన స్వప్న నిజ స్వరూపం బయటపడితే తలవంచుకుని బయటికి వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ ఇలా రివర్స్ అవుతుంది అనుకోలేదు. దాన్ని తింగరిది అనుకున్నాం కానీ మనల్ని తింగరి వాళ్ళని చేసింది అంటాడు రాహుల్. అదే అది చేసిన పెద్ద తప్పు ఇప్పుడు అందరి దృష్టిలోని అది చెడ్డదానిగా మారింది.
స్వప్నని బయటకు పంపించేయాలని మనం ఎంత ఆత్రం గా ఉన్నామో కావ్యని బయటికి పంపించాలని వదిన కూడా అంతే ఆత్రంగా ఉంది, ఒకవేళ అలా లేకపోయినా వదినని రెచ్చగొట్టడానికి మనం ఉన్నాం కదా అంటుంది రుద్రాణి. మరోవైపు అక్కడ అంత మంది ముందు ఏమి మాట్లాడలేదు ఏం బావ అని అడుగుతుంది చిట్టి. అక్కడ ఎవరి కారణాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, నా మాట వినే పరిస్థితులలో ఎవరు లేరు అంటాడు సీతారామయ్య.
అలానే ఊరుకుంటే ఎలా బావ, మన పెద్దరికంతో వాళ్లకే దావు చూపించాలి కదా, రేపు నువ్వు చెప్పే నిర్ణయం కోసం అందరూ చూస్తున్నారు అంటుంది చిట్టి. నాకు అదే భయంగా ఉంది ఈ పెద్దరికాన్ని అంటగట్టి ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నా చేత నాశనం చేయిస్తారేమో అని భయంగా ఉంది మొదటిసారి ఈ రాత్రి ఆగిపోతే బాగున్ను అంటాడు సీతారామయ్య. మరోవైపు అత్తగారికి కాఫీ తీసుకొస్తుంది కావ్య.
నువ్వు మర్యాదగా నీ అక్కని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపో, అదే మామయ్య నిర్ణయం తర్వాత మేము నిన్ను పంపించాల్సి వస్తే చాలా అవమానకరంగా పంపిస్తాము అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. పక్కనే ఉన్న సుభాష్ వైపు చూస్తుంది కావ్య. నా వైపు చూసి లాభం లేదు కావ్య నేను నీ వైపు మాట్లాడాలని ఉన్నా ఆ అవకాశం లేకుండా చేసావు. నువ్వు తప్పు చేశావు కావ్య.
నీకు నిజం తెలిసినప్పుడు నాకైనా చెప్పి ఉండాల్సింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్. మరోవైపు తాతయ్య దగ్గరికి వచ్చినేను అబద్ధం చెప్పలేదు తాతయ్య, నిజం దాచాను అంతే. నేను తప్పు చేయలేదు అనటం లేదు కానీ ఆ తప్పు చేయకుండా ఉండే అవకాశం నా చేతుల్లో లేకుండా పోయింది. మీరైనా అర్థం చేసుకోండి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్న నేను స్వీకరిస్తాను అని చేతులు జోడించి చెప్తుంది కావ్య.
మరోవైపు ఆలోచిస్తున్న స్వప్న దగ్గరికి వచ్చి ఇంట్లోంచి వెళ్లకుండా ఉండటం ఎలా అని ఆలోచిస్తున్నావా తప్పుచేసి దొరికిపోయావు ఇకమీదట నీకు ఇంట్లో ఉంటే చాన్స్ లేదు అంటాడు రాహుల్. పెళ్లి పీటల మీద నుంచి లేవ తీసుకుపోయిన నువ్వు తప్పు గురించి మాట్లాడొద్దు అంటుంది స్వప్న. ఎవరు పిలిచా వెళ్లిపోతావా అని వెటకారంగా అడుగుతాడు రాహుల్.
కోపంగా అతని కాలర్ పట్టుకుని స్వప్న అంటే క్యారెక్టర్ లేనిది కాదు నీలాగా పదిమంది వెనకాతల తిరగను. డబ్బుంది కాబట్టి రాజ్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతే. కానీ నిన్ను ప్రేమించాక నీకు ఈ ఇంట్లో విలువ లేదని తెలిసి కూడా నీతోనే ఉన్నాను అంటే అందుకు కారణం ఈ జన్మకి నువ్వే నా మొగుడిని ఫిక్స్ అయ్యాను కాబట్టి. నువ్వు కూడా ఈ జన్మకి నేనే భార్యని అని ఫిక్స్ అయిపో.
అందరి అమ్మాయిల్లాగా నన్ను గెలికి చాలా పెద్ద తప్పు చేసావు అని భర్తకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. స్వప్న ఫ్రస్టేషన్ కి షాక్ అయిపోతాడు రాహుల్. నిజంగానే దీన్ని కెలికి తప్పు చేశాను అనుకుంటాడు. మరోవైపు కృష్ణుడితో తన బాధ చెప్పుకుంటుంది కావ్య. ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను నేను అడిగిన ఒకే ఒక కోరిక నా భర్త అయినా నన్ను అర్థం చేసుకోవాలని,ఆ ఒక్క కోరిక కూడా నువ్వు తీర్చడం లేదు.
నీకు ఓపిక లేకపోతే ఆ అవకాశం నాకైనా ఇవ్వు నా కాపురాన్ని నేనే సరిదిద్దుకుంటాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. తరువాయి భాగంలో కావ్య ఫోటోని కాల్చేస్తాడు రాజ్ . అది చూసిన కావ్య మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు అంటుంది. రేపు తాతయ్య నిర్ణయం తర్వాత ఈ దూరం శాశ్వతం అయిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్.