- Home
- Entertainment
- 6 కోట్ల బడ్జెట్, 100 కోట్లు వసూలు చేసి, ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన చిన్న సినిమా ఏదో తెలుసా?
6 కోట్ల బడ్జెట్, 100 కోట్లు వసూలు చేసి, ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన చిన్న సినిమా ఏదో తెలుసా?
2025లో చాలా హిట్ సినిమాలు వచ్చినా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఓ చిన్న సినిమా 100 కోట్లు వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా?

6 కోట్ల బడ్జెట్ తో 100 కోట్లు వసూలు చేసిన సినిమా
పెద్ద పెద్ద స్టార్ హీరోలు, వందల కోట్లతో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యే ఈ రోజుల్లో, కేవలం ఆరు కోట్లతో నిర్మించిన `సు ఫ్రమ్ సో` సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలి వారంలోనే లాభాల బాట పట్టింది. 100 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది.
రజినీకాంత్ కు ఎదురు నిలిచిన సినిమా
రాజ్ బి. శెట్టి బృందం నిర్మించిన ఈ సినిమాకు జె.పి. తుమినాడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫ్రమ్ సో ఒక పట్టణంలో జరిగే కథ. ఒక ఇంట్లో తలెత్తే సమస్యను ఆ ఊరు ఎలా ఫేస్ చేసింది అనేది కథ. విడుదలైన మొదటి రోజు నుండి అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటున్న సు ఫ్రమ్ సో చిత్రాన్ని అభిమానులు స్వయంగా ప్రమోట్ చేస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ లేకపోయినా.. థియేటర్ల కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. జూలై 25న విడుదలైన ఈ సినిమా కర్ణాటకలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాకు పోటీ ఇస్తోంది.
తెలుగు, మలయాళంలో కూడా
సు ఫ్రమ్ సో చిత్రంలో అశోక్ పాత్ర పోషించిన జె.పి. దుమినాడు ఈ చిత్రానికి దర్శకుడు. ఒక ఇంటర్వ్యూలో, దుమినాడు మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో అద్భుతమైన సినిమా తీయడం రాజ్ బి. శెట్టికి తెలుసని అన్నారు. ఈ సినిమాలో జె.పి. తుమినాడు, రాజ్ బి. శెట్టి, శనీల్ గౌతమ్ తదితరులు నటించారు. కన్నడలో మాత్రమే కాదు తెలుగు, మలయాళంలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మలయాళంలో ఈసినిమాను యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కు సబందించిన వేఫేరర్ సంస్థ మలయాళ హక్కులను సొంతం చేసుకొని ఆగస్ట్ 1న కేరళలో విడుదల చేసింది. అక్కడ కూడా సినిమా మంచి స్పందన సాధించింది.
కన్నడలో సంచలనంగా మారిన సినిమా
కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సు ఫ్రమ్ సో చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్లతో సరికొత్త రికార్డును సృష్టించింది. 100 కోట్ల బడ్జెట్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా కూడా సు ఫ్రమ్ సో రికార్డు సృష్టించింది. ఈ మూవీ ప్రస్తుతం 120 కోట్ల కలెక్షన్ మార్క్ కు దగ్గరగా దూసుకుపోతోంది. ఇప్పటికీ కన్నడనాట థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. సు ఫ్రామ్ సో చిత్రం నుండి నిర్మాతలు భారీ లాభాలను ఆర్జించారు. తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ మాదిరిగానే, సు ఫ్రమ్ సో కన్నడలో భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. మరి ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది.