MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బాహుబలిలో అనుష్క డూప్ గా నటించిన మరో హీరోయిన్ ఎవరో తెలుసా?

బాహుబలిలో అనుష్క డూప్ గా నటించిన మరో హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమాల్లో స్టార్స్ కు డూప్ లు నటించడం కామన్. హీరోయిన్లకు కూడా కొన్ని సందర్భాల్లో డూప్ యాక్టర్స్ నటిస్తుంటారు. ఈక్రమంలో బాహుబలి సినిమాలో అనుష్క పాత్ర కోసం ఓ హీరోయిన్ డూప్ గా నటించిందని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 20 2025, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : netflix

టాలీవుడ్ స్థాయిని పెంచిన బాహుబలి

పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన ఈ సినిమా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన బాహుబలి, రెండు భాగాలుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిందీ బాహుబలి సినిమా.

DID YOU
KNOW
?
బ్యాచిలర్ హీరోయిన్
అనుష్క శెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయారు. 43 ఏళ్లు వచ్చినా ఆమె పెళ్లి చేసుకోలేదు. అనుష్క పెళ్లిపై ఇప్పటికే రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Image Credit : netflix

బాహుబలి సినిమాలో అనుష్క పాత్ర ప్రత్యేకం

ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించగా, అనుష్క శెట్టి, తమన్నా, హీరోయిన్స్‌గా కనిపించారు. అనుష్క పాత్రకు ఈ సినిమాలో విపరీతమైన ప్రాధాన్యం ఉంది. మొదటి పార్టులో దేవసేనగా బానిస పాత్రలో కనిపించి, రెండో భాగంలో యువరాణిగా తన నటనతో అందరిని మెప్పించింది అనుష్క. రెండు రకాల పాత్రలను ఆమె అంద్భుతంగా ప్లే చేసింది. వీరపత్నిగా, వీరమాతగా అనుష్క పెర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమాలో అనుష్కుకు కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. ప్రభాస్ తో కలిసి ఆమె విలన్స్ తో ఫైటింగ్ చేసిన సీన్స్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సెలబ్రిటీస్ సీన్స్ కు సంబంధించి కొన్ని సన్నివేశాలు డూప్ లతో చిత్రీకరించడం అందరికి తెలిసిన విషయమే. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్, రాణాలతో పాటు అనుష్క కోసం కూడా డూప్ యాక్ట్రస్ పనిచేశారట. అయితే విచిత్రం ఏంటంటే ఈసినిమాలో స్వీటి పాత్రకు డూప్ గా చేసింది కూడా ఓ హీరోయిన్నే.

34
Image Credit : Instagram / Rishika Raj

అనుష్క శెట్టి పాత్రకు డూప్‌గా మరో హీరోయిన్

బాహుబలిలో అనుష్క శెట్టి పాత్రకు డూప్‌గా నటించింది ఎవరో కాదు ఆమె పేరు రుషిక రాజ్. ఈ యంగ్ లేడీని చూసి చాలా మంది అనుష్కనే అనుకుంటుంటారు. ఆమె హైట్, స్కిన్‌టోన్, బాడీ లాంగ్వేజ్‌ కూడా అనుష్కను పోలి ఉంటుంది.రుషిక రాజ్ 2021లో వచ్చిన అశ్మీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం కన్నడ సినిమాల్లో యాక్టివ్‌గా నటిస్తున్న రుషిక, బాహుబలి చిత్రంలో డూప్ పాత్రతో పాటు బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించింది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తరచూ ఫోటోషూట్స్‌తో హడావిడి చేస్తుంటుంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rushika Raj (@rushikaraj_official)

44
Image Credit : instagram / Anushka Shetty

అనుష్క సినిమా అప్ డేట్

ఇక అనుష్క విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె ఘాటీ అనే సినిమాలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో అనుష్క చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందని మూవీ టీమ్ వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా ఇమేజ్ తో ఈ సినిమా రూపొందింది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఘాటీ విడుదల కాబోతోంది. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తోంది అనుష్క. ఘాటీ సినిమా తరువాత ఆమె ఏ ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు. ఈసినిమా తరువాత ఆమె సినిమాలకు గుడ్ బై చెపుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజం ఎంత తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
ప్రభాస్
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
తమిళ ఇండస్ట్రీని ఊపేస్తోన్న కింగ్ నాగార్జున, యూత్ లో సైమన్ కిక్కు మామూలుగా ఎక్కలేదుగా
Recommended image2
చిరంజీవి తో భారీ పౌరాణిక సినిమా ప్లాన్ చేసిన నిర్మాత, వీర అర్జున టైటిల్, కానీ ఎందుకు సెట్స్ మీదకు వెళ్లలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved