MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ సినిమా చూడాలని ఇండియాకు, ఈ మహిళా అభిమానిది ఏ దేశమో తెలుసా?

ఎన్టీఆర్ సినిమా చూడాలని ఇండియాకు, ఈ మహిళా అభిమానిది ఏ దేశమో తెలుసా?

సినిమా తారలపై అభిమానం ఊర్లు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు కూడా దాటి ప్రయాణిస్తోంది. దేశ విదేశాల్లో కూడా మన తెలుగు హీరోల క్రేజ్ ఏ రేంజ్ లో పనిచేస్తోందంటే.. సినిమా చూడటానికి విదేశాల నుంచి ఇండియాకు వచ్చేంతగా. 

3 Min read
Mahesh Jujjuri
Published : Aug 21 2025, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : instagram

ఎన్టీఆర్ అభిమానులు ప్రత్యేకం

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వస్తున్నాడని తెలిస్తే లక్షల సంఖ్యలో అభిమానులు తారక్ ఈవెంట్లకు చేరుకుంటుంటారు. ఎన్టీఆర్ కోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి వారు వెనకాడరు. అందుకే తారక్ కూడా ఫ్యాన్స్ ఇబ్బందులు గుర్తించి ఈ మధ్య పెద్దపెద్ద ఈవెంట్లు చేయడం మానేశారు. వరంగల్ లో ఓ అభిమాని మరణం ఎన్టీఆర్ ను కలచివేసింది. దాంతో పెద్ద ఈవెంట్లు నిర్వహించడంలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వార్ 2 ఈవెంట్ లో ప్రస్తావించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు దేశవిదేశాల్లో అభిమానులున్న సంగతి తెలిసిందే. తారక్ కోసం పలు సందర్భాల్లో వారు ఇండియాకు వచ్చిన సంఘటనల గురించి కూడా చూస్తూనే ఉన్నాం.

DID YOU
KNOW
?
ఎన్టీఆర్ కోసం
జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఎంత క్రేజ్ ఉందంటే, ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడాలని ఓ జపాన్ అభిమాని తెలుగు భాషను ఎంతో కష్టపడి నేర్చుకున్నారు. దేవర ప్రమోషన్స్ కు వెళ్లినప్పుడు ఎన్టీఆర్ తో తెలుగులో మాట్లాడి ఆయనకు షాక్ ఇచ్చింది.
25
Image Credit : X/Jr ntr

జపాన్ లో జూనియర్ క్రేజ్

ఈక్రమంలోనే ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో జపాన్ అభిమానుల మనసు దోచేశాడు. జపాన్ లో తారక్ క్రేజ్ అంతా ఇంతా కాదు. జపాన్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ఎన్నో సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్ సినిమా అంటే వారు వదలకుండా చూస్తారు. తారక్ ఫ్యాషన్ ను కూడా అక్కడ ఫాలో అవుతారు. ఎన్టీఆర్ మీద వారికి ఎంత అభిమానం ఉందంటే, ఆయన సినిమా చూడటానికి లక్షలు ఖర్చుపెట్టి ఇండియాకు వచ్చేంతగా. రీసెంట్ గా  ఓ అభిమాని జపాన్ నుంచి తారక్ సినిమా చూడటం కోసం ఇండియాకు వచ్చింది.  అది కూడా ఒక మహిళ సొంత ఖర్చులతో ఇండియాకు వచ్చి, ఎన్టీఆర్ సినిమా చూసి వెళ్లింది. ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా 'వార్-2'ను వీక్షించేందుకు క్రిసో అనే జపనీస్ యువతి జపాన్ నుంచి ఇండియాకు ప్రయాణించింది.

Related Articles

Related image1
నాగార్జునను సినిమాల్లోకి వెళ్లమన్నది ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు కళ్లలో నీళ్లు తిరిగిన సందర్భం ?
Related image2
చిరంజీవి తో భారీ పౌరాణిక సినిమా ప్లాన్ చేసిన నిర్మాత, వీర అర్జున టైటిల్, కానీ ఎందుకు సెట్స్ మీదకు వెళ్లలేదు
35
Image Credit : instagram / arflyerar

సినిమా చూడటానికి ఇండియా వచ్చిన అభిమాని

ఇటీవల ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రిసో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన టీ-షర్ట్‌పై ఎన్టీఆర్ ఫొటో ముద్రించబడింది. విమానాశ్రయంలో పలువురు ఆమెను పలకరించగా, తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని, ప్రత్యేకంగా 'వార్-2' సినిమా థియేటర్లోనే చూడాలని భారత్‌కు వచ్చానని వెల్లడించింది.క్రిసో తెలిపిన ప్రకారం, ఇది ఆమెకు తొలిసారి కాదు. గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాల కోసం ఇండియాకు వచ్చానని పేర్కొంది. తారక్ సినిమాలన్నింటిని ప్రేమతో చూస్తానని, ఎన్టీఆర్ నెక్ట్స్  సినిమాకు కూడా తప్పకుండా భారత్‌కు వస్తానని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ARS CineVerse | ARS ప్రయాణ ప్రపంచం (@arflyerar)

45
Image Credit : Youtube/Sithara Entertainments

ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ ఇమేజ్

'ఆర్ఆర్ఆర్' సినిమాతో జపాన్‌లో ఎన్టీఆర్‌కు భారీ అభిమాన బేస్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అనంతరం వచ్చిన 'దేవర' సినిమా సమయంలో ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకుని ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వీడియోను స్వయంగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఇప్పుడు 'వార్-2' కోసం మరో అభిమాని దేశం దాటి రావడం ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్‌ను మళ్లీ రుజువు చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఎన్టీఆర్ అభిమానులు "ఇది ఆయనకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనం" అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను మరింతగా వైరల్ చేస్తున్నారు.

My visits to Japan always give me beautiful memories but this one hit differently. Hearing a Japanese fan tell me she learned Telugu after watching RRR truly moved me. 

Being a lover of cinema and languages, the power of cinema to be a bridge across cultures and encouraging a… pic.twitter.com/4bQ1v8ZZP8

— Jr NTR (@tarak9999) March 27, 2025

55
Image Credit : instagram

అలరించలేకపోయిన వార్ 2

ఇక భారీ అంచనాల నడుమ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'వార్-2' సినిమా రిలీజ్ అయ్యింది. ఈసినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. బాలీవుడ్ లో, సౌత్ లో భారీ రెస్పాన్స్ ను రాబడుతుందని అనుకున్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. అయినా, ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి సన్నివేశాల కోసం అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved