Shruti Haasan: స్వేచ్చగా బ్రతకాలనుకున్నాను, కానీ అతడు భయపెట్టాడు... శృతి హాసన్ కామెంట్స్!
శ్రుతి హాసన్ ని ఓ వ్యక్తి ఆందోళనకు గురి చేశాడట. ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటనతో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.
Shruti Haasan
శృతి హాసన్ కి ఇటీవల ఓ షాకింగ్ ఘటన ఎదురైందట. ఓ వ్యక్తి ఆమెను ఆందోళనకు గురి చేశాడట. దాంతో భద్రతా సిబ్బంది అవసరం అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. విషయంలోకి వెళితే...
Shruti Haasan
ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వస్తున్న శృతి హాసన్ ని ఓ వ్యక్తి వెంబడించాడట. మొదట అతడు అభిమాని అనుకుందట. కానీ అతడు కారు వరకు వస్తూనే ఉన్నాడట. అతడు చర్యలు భయపెట్టాయట. ధైర్యం తెచ్చుకుని తర్వాత ఎవరు నువ్వని అడిగిందట. అతడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడట.
నేను స్వేచ్చగా ఉండాలి అనుకుంటాను. అందుకే భద్రతా సిబ్బందిని నియమించుకోను. ఈ సంఘటన తర్వాత వాళ్ళ అవసరం ఉందనిపిస్తుంది శృతి హాసన్ అభిప్రాయపడింది.
శృతి హాసన్ కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. కొన్నాళ్లు పరిశ్రమకు దూరమైన శృతి కమ్ బ్యాక్ అనంతరం పుంజుకుంది. క్రాక్, వకీల్ సాబ్ వంటి హిట్స్ ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా దర్శకుడు గోపి చంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ మాంచి కిక్ ఇచ్చింది.
Shruti Haasan
ఇక 2023 సంక్రాంతి సందడి మొత్తం శృతి హాసన్ దే. ఆమె హీరోయిన్ గా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రెండు చిత్రాలకు కలిపి మంచి ప్యాకేజ్ అందుకున్నట్లు సమాచారం.
కాగా శృతి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విడుదల వాయిదా పడింది. సలార్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సలార్ రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం కలదంటున్నారు. అదే జరిగితే శృతి పంట పండినట్లే. సలార్ 2 కూడా ఆమె ఖాతాలో చేరుతుంది.
Shruti Haasan
మరోవైపు శృతి లవ్ ఎఫైర్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు.