- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న గీతా మాధురి పోజులు.. స్టార్ సింగర్‌ని ఇలా చూస్తే మెంటలే
బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న గీతా మాధురి పోజులు.. స్టార్ సింగర్‌ని ఇలా చూస్తే మెంటలే
స్టార్ సింగర్ గీతా మాధురి.. ఇటీవల గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. ఓ వైపు తన మధురమైన గాత్రంతో కట్టిపడేస్తుంది. మరోవైపు ఇలా వరుస ఫోటో షూట్లతో ఫిదా చేస్తుంది. ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

గీతా మాధురి.. చాలా వరకు ఐటెమ్ సాంగ్‌లకు, డస్కీ వాయిస్‌తో కూడిన పాటలకే కేరాఫ్‌గా. ఆమె పాడిన ఎన్నో పాటలు కుర్రాళ్లని ఉర్రూతలూగించాయి. ఆడియెన్స్ ని అలరించాయి. శ్రోతలను మంత్రముగ్దుల్ని చేశాయి. తనదైన ప్రత్యేకమైన వాయిస్‌తో కట్టిపడేస్తుంది ఈ స్టార్ సింగర్. కానీ ఇటీవల ఈ అమ్మడిలో చాలా మార్పు వచ్చింది.
అద్భుతమైన గాయనిగా పేరుతెచ్చుకున్న గీతా మాధురి.. 2007లో రామ్ చరణ్ హీరోగా పరిచయం అవుతూ నటించిన `చిరుత` చిత్రంతో తను కూడా గాయనిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇందులో `చమ్కా చమ్కా` పాట పాడి ఉర్రూతలూగించింది. రొమాంటిక్ సాంగ్‌ని అంతే క్రేజీగా పాడి ఆకట్టుకుంది. అంతే ఆ తర్వాత ఈ అమ్మడి వద్దకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.
ఆ తర్వాత ఏడాది పదికిపైగా పాటలు పాడి బిజీగా గడిపింది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. బ్లాక్ బస్టర్ పాటలు పాడింది. రొమాంటిక్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్, డివోషనల్ సాంగ్స్, ఇండిపెండెంట్ సాంగ్, ఫోక్ సాంగ్స్ ఇలా అన్ని రకాల పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ సింగర్‌గా ఎదిగింది.
దాదాపు తన 15ఏళ్ల కెరీర్‌లో సుమారు రెండు వేల వరకు పాటలు పాడింది గీతా మాధురి. నంది అవార్డులతోపాటు సైమా అవార్డులు, ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకుంది. అగ్ర గాయనిగా పేరుతెచ్చుకున్నారు. సీనియర్ తరం తర్వాత నెక్ట్స్ జెనరేషన్ సింగర్స్ లో ఒకానొక టాప్ సింగర్‌గా నిలిచారు గీతా మాధురి.
ఇటీవల ఆమె జోరు తగ్గింది. యంగ్ సింగర్స్ రావడంతో గీతా మాధురికి అవకాశాలు తగ్గాయి. దీంతో తనుకూడా చాలా సెలక్టీవ్‌గానే పాడుతుంది. ఈ నేపథ్యంలో టర్న్ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో బిజీ అవుతుంది. హీరోయిన్ల తరహాలో ఫోటో షూట్లు చేస్తుంది. అందంలో వారికి ఏమాత్రం తీసిపోలేదని చాటి చెబుతుంది. ఆద్యంత కట్టిపడేస్తుంది.
తాజాగా స్లీవ్ లెస్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. అందంతో మైండ్ బ్లాక్ చేస్తుంది. స్టార్ సింగర్ ఇలా హాట్‌గా కెమెరాకి పోజులివ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆమె అందానికి ఫిదా అవుతుంది. ఇలా తనదైన హాట్‌నెస్‌లో మెంటల్ ఎక్కిస్తుందీ స్టార్ సింగర్. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.
గీతా మాధురి.. నటుడు నందుని వివాహం చేసుకుంది. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా రాణిస్తున్నారు. నందు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. నటుడిగా నిలబడేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.