- Home
- Entertainment
- Keerthy Suresh: కత్తిలాంటి చూపులతో పిచ్చెక్కిస్తున్న కీర్తి... చీరలో ఓ రేంజ్ లో చూపించేసింది!
Keerthy Suresh: కత్తిలాంటి చూపులతో పిచ్చెక్కిస్తున్న కీర్తి... చీరలో ఓ రేంజ్ లో చూపించేసింది!
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. నెట్ శారీలో ఈ హోమ్లీ బ్యూటీ పరువాల ప్రదర్శన చేసింది. కీర్తి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Keerthy Suresh
హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ దసరా మార్చి 30న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో డిజైనర్ శారీ ధరించి కీర్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇక శారీలో గ్లామరస్ ఫోటో షూట్ చేసి మనసులు దోచేసింది. ముఖ్యంగా ఆమె చురకత్తుల్లాంటి చూపులు గుండెలు కొల్లగొడుతున్నాయి.
Keerthy Suresh
కాగా నాని హీరోగా నటించిన దసరా మూవీపై అంచనాలు పెరిగాయి. చిత్ర టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా బజ్ ఏర్పడింది. దసరా పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. సరైన కమర్షియల్ హిట్ లేక అల్లాడుతున్న నాని ఈ మూవీ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.
Keerthy Suresh
కీర్తి కెరీర్ పీక్స్ లో ఉండగా ఎఫైర్ రూమర్స్ ఎక్కువైపోయాయి. ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. అనంతరం ఏకంగా పెళ్లైన విజయ్ తో అంటగట్టారు. స్టార్ హీరో విజయ్ తో ఆమె లింకప్ అయ్యారని, ఇది తెలిసిన ఆయన భార్య విడాకులు సిద్దమయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. విజయ్ భార్యతో పాటు ఓ ఈవెంట్ కి హాజరై ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు.
Keerthy Suresh
పరిశ్రమకు చెందినవారు కాదు... కీర్తి సురేష్ లవర్ చిన్నప్పటి క్లాస్ మేట్ ని ప్రేమిస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు 13 ఏళ్లుగా కీర్తి అతన్ని ప్రేమిస్తున్నారట. సదరు క్లాస్ మేట్ వ్యాపారవేత్త అట. కేరళకు చెందిన ఆ యువకుడికి రిసార్ట్స్ బిజినెస్ ఉందట. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలుసట. ఈ క్రమంలో త్వరలో అధికారికంగా పెళ్లి ప్రకటన రానుందట. అయితే ఈ వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు.
Keerthy Suresh
అయినా కీర్తికి ప్రేమించే తీరిక ఎక్కడుంది చెప్పండి. ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రివాల్వర్ రాణి టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు. గత ఏడాది సర్కారు వారి పాట మూవీతో హిట్ కొట్టారు. కెరీర్లో ఫస్ట్ టైం మహేష్ కి జంటగా నటించిన కీర్తి గ్లామర్ తో ఆకట్టుకున్నారు. సర్కారు వారి పాట మూవీలో నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేయడం విశేషం.
Keerthy Suresh
ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు.
Keerthy Suresh
భోళా శంకర్ తో పాటు తెలుగులో దసరా మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.అలాగే తమిళంలో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మామన్నన్ మూవీలో కీర్తి నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. అమెజాన్ ఒరిజినల్ చిన్ని మూవీలో సీరియల్ కిల్లర్ గా అలరించారు.తల్లి వారసత్వాన్ని నిలబెడుతూ కీర్తి స్టార్ గా ఎదిగారు.