- Home
- Entertainment
- Shivathmika Rajasekhar: చెల్లి బోల్డ్ ఫోటోపై అక్క హాట్ కామెంట్... శివాత్మిక ఇలా తెగించింది ఏంటి!
Shivathmika Rajasekhar: చెల్లి బోల్డ్ ఫోటోపై అక్క హాట్ కామెంట్... శివాత్మిక ఇలా తెగించింది ఏంటి!
శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ ఫోజుల్లో కాక రేపారు. నైట్ వేర్ ని పోలిన డ్రెస్లో అందాల ప్రదర్శన చేశారు. శివాత్మిక లేటెస్ట్ ఫోటో వైరల్ అవుతుంది.

Shivathmika Rajasekhar
స్టార్ కిడ్ శివాత్మికకు సిల్వర్ స్క్రీన్ పై అన్నీ హోమ్లీ రోల్స్ వస్తున్నాయి. ఆమె మాత్రం బోల్డ్ ఇమేజ్ కోరుకుంటున్నారనిపిస్తుంది. అందుకు శివాత్మిక ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఆమె బ్లూ కలర్ హాట్ ట్రెండీ వేర్ ధరించి టూ మచ్ స్కిన్ షో చేశారు. శివాత్మిక హాట్ ఫోటోపై అక్క శివాని స్పందించారు. నువ్వు ఫైర్ అంటూ కామెంట్ పెట్టింది. చెల్లి గ్లామరస్ ఫోటోపై అక్క చేసిన కామెంట్ వైరల్ అవుతుంది.
హీరో రాజశేఖర్, నటి జీవితల వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది.
shivathmika Rajashekar
అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయినప్పటికీ మొదటి చిత్రంతోనే శివాత్మిక తన మార్క్ చూపించింది. నటిగా నిరూపించుకుంది. శివాత్మిక పరిశ్రమకు వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమెకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. ఈ క్రమంలో అందాలతో మేకర్స్ దృష్టి తనవైపు మరలేలా చేసుకుంటుంది. శివాత్మిక సోషల్ మీడియా వేదికగా సూపర్ హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. శివాత్మిక లేటెస్ట్ మూవీ పంచతంత్రం డిసెంబర్ 9న విడుదలైంది.
హృదయాన్ని కదిలించే సామాజిక కోణాలు కథలుగా తీసుకొని ఎమోషనల్ డ్రామాగా పంచతంత్రం తెరకెక్కింది. పంచతంత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చెప్పుకోదగ్గ పాత్ర ఇంకా ఆమె తలుపు తట్టలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆమె ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
ప్రస్తుతం రంగమార్తాండ మూవీలో శివాత్మిక నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలంగా రంగమార్తాండ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. వారి కూతురుగా శివాత్మిక నటిస్తున్నట్లు సమాచారం. ఇది మరాఠీ చిత్రం రీమేక్.రంగమార్తాండ విడుదలకు సిద్ధం అవుతుంది.