అందాల విందుకు తెరలేపిన ప్రభాస్ విలన్ కూతురు... బ్లాక్ అండ్ వైట్ లో అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన స్టార్ కిడ్
స్టార్ హీరోలు, నటుల కూతుర్లు హీరోయిన్స్ గా మారడం టాలీవుడ్ లో చాలా అరుదు. కానీ బాలీవుడ్ ఈ కల్చర్ తారా స్థాయిలో ఉంది. హీరోలు, దర్శకులు, నిర్మాతల కూతుర్లు స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోయారు.
ఈ కోవకే చెందుతుంది సారా అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ అమృతా సింగ్ ల కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా 2018లో విడుదలైన కేధార్ నాథ్ చిత్రంతో సారా హీరోయిన్ గా మారారు.
ఒకప్పటి సారా అలీ ఖాన్ ని చూసిన ఎవరూ ఆమె హీరోయిన్ అవుతారని భావించి ఉండరు. భయంకరమైన శరీరంతో షేపవుట్ బాడీలో ఉండే సారా కష్టపడి పదుల సంఖ్యలో బరువు తగ్గారు. ఇప్పటికి కూడా శరీరం సన్నగా నాజూగ్గా ఉండడం కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఉంటారు.
ఇక ఇప్పుడిప్పుడే సారా అలీఖాన్ బాలీవుడ్ లో ఎదుగుతున్నారు. ఆమె నటించిన కేదార్ నాధ్, సింబా, లవ్ ఆజ్ కల్, కూలి నంబర్ వన్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో ఆమె నటించడం జరిగింది.
ప్రస్తుతం సారా అట్రాంగిరే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కోలీవుడ్ హీరో ధనుష్, అక్షయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో సారా ఆలీ ఖాన్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ కాకరేపుతూ ఉంటారు. తాజాగా సూపర్ హాట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పంచుకున్నారు. సారా గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బాలీవుడ్ లో సారా కెరీర్ మొదలై నాలుగేళ్లు కూడా గడవక ముందే అనేక ఎఫైర్ రూమర్స్ పేస్ చేశారు. మొదట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఎఫైర్ నడిపిన సారా, ఆ తరువాత ఆర్యన్ కార్తీక్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె కేదార్ నాథ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జెహన్ హండాతో సన్నిహితంగా ఉంటున్నారు.
ఇక సారా అలీ ఖాన్ తండ్రి సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ మూవీలో రావణుడి పాత్ర చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ ఈ రామాయణ గాథ తెరకెక్కిస్తున్నారు.