షూటింగ్స్ తో స్టార్ హీరోలంతా బిజీ బిజీ.. మరి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు..?
టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఎవరి షూటింగ్స్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. మొన్నటి వరకూ కరోనా భయంతో షూటింగ్స్ సరిగ్గా చేసుకోలేకపోయిన స్టార్స్. ఇప్పుడు తమ షూటింగ్స్ ను పరుగులు పెట్టిస్తున్నారు. మరి ఏ హీరో ఎక్కడ షూటింగ్ చేసుకుంటున్నారో చూదాం..

తెలుగు స్టార్ హీరోలంతా లోకేషన్స్ లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ (Megastar Chiranjeevi)నుంచి మెగా పవర్ స్టార్ వరకు.. భారీ బడ్జెట్ సినిమాల నుంచి చిన్న సినిమాల వరకూ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. షూటింగ్స్ తో స్టూడియోలు.. లొకేషన్లు కళకళలాడుతున్నాయి. చాలా వరకూ స్టార్స్ హైదరాబాద్ లోనే షూటింగ్స్ చేసుకుంటున్నారు. కొంత మంది మాత్రం అవుడ్డోర్ లో ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక వైపు గాడ్ ఫాదర్ షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు బాబీ(Boby) సినిమాను కూడా ట్రాక్ ఎక్కించాడు. ఇక ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో జరుగుతుంది. సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక యూనివర్సల్ స్టార్ ప్రభాస్(Prabhas), బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె (Deepika Padukone) జంటగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనే మరియు బాలీవుడ్ స్టార్ అమితాబ్(Amitabh) కూడా జాయిన్ అయ్యారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan) హీరోగా, కియారా అద్వాని హీరోయిన్ గా.. పాన్ ఇండియా స్టార్ శంకర్(Shankar) డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ రాజమండ్రీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చరణ్ కు సంబంధించిన ఓపెన్ అవుట్ డోర్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు టీమ్.
అటు మాస్ మహారాజ్ రవి తేజ(Ravi Teja) కూడా తన సినిమాల షూటింగ్స్ ను పరుగులు పెట్టిస్తోంది. మొన్నటి వరకూ రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ లో పాల్గోన్న రవితేజ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ధమాకా షూటింగ్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ సారథి స్టూడియోలో జరుగుతుంది
ఇక నందమూరి హీరో కల్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాతో రాజేంద్ర అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.
ఇక తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ.. చేస్తోన్న ఫస్ట్ తెలుగు మూవీ సార్. ఈమూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కాని ధనుష్ కు కోవిడ్ రావడంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా తరువాత శేఖర్ కమ్ములాతో ధనుష్ ప్రాజెక్ట్ ఉంది.