MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డేటింగ్ చేయాలని వేదించారు.. ఆ ఇద్దరు హీరోలపై తాప్సి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.

డేటింగ్ చేయాలని వేదించారు.. ఆ ఇద్దరు హీరోలపై తాప్సి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వలసపోయింది హీరోయిన్ తాప్సీ. అక్కడ కెరీర్ నుపరుగులుపెట్టించింది. ఇబ్బందులు పడ్డా.. హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. కాట్రవర్సీ కామెంట్స్ తో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ వస్తున్న తాప్సీ.. తాజాగా చేసిన కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 15 2023, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకంటే.. బాలీవుడ్ లోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది అంటోంది స్టార్ హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్ లో  వేదింపులు ఎక్కువ అంటూ వాపోయింది. ఓ ఇద్దరు హీరోలు చేసిన పని తనను బాధించిందంటూ..తాప్సీ వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది సొట్టబుగ్గల సుందరి తాప్సీ.  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో టాలీవుడ్ లో అడుగు పెట్టిన అందాల సుందరి. ఫస్ట్ సినిమాతోనే అన అందచందాలతో అలరించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆతరువాత టాలీవుడ్ లో తాప్సీ కెరీర్ అనుకున్నంత బాగా నడవదలేదు. 

37

హీరోయిన్ గా పెద్ద ఛాన్స్ లు అందుకోలేకపోయింది. అందుకున్నవి కూడా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే, అందులో కొన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ హోదాకు దూరంగా ఉండిపోయింది తాప్సీ. దాంతో టాలీవుడ్ లో తన టైమ్ బాగోలేదని..బాలీవుడ్ కు మకాం మార్చేసింది బ్యూటీ. బాలీవుడ్ లో వరుసగా ఛాన్స్ లు తగలడంతో..టాలీవుడ్ పై..రెచ్చిపోయి ఘాటు వ్యాఖ్యలు చేసింది.  

47

దీంతో వరుస సక్సెస్ లు రావడంతో అక్కడే తాప్సీ  సెటిల్ అయిపోయింది. సినిమాలతోనే కాకుండా వరుస కాంట్రవర్సీలతో కూడా పాపులర్ అయింది తాప్సీ పన్ను. ప్రస్తుతం వరుసగా  లేడి ఓరియెంటెడ్ సినిమాలు బయోపిక్ సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది.కాల్షీట్లు కూడా ఖాళీ లేకుండా చూసుకుంటుంది. 

57
Taapsee Pannu

Taapsee Pannu

స్టార్స్ మీద.. కాస్టింగ్ కౌచ్ మీద, నెపొటిజం మీద.. ఇలా తాప్సి  చేయని కాంట్రవర్సీ లేదు బాలీవుడ్ లో. మరో ఫైర్ బ్రాండ్ కంగనాతో కయ్యం దగ్గర నుంచి రకరకాల వివాదాలు తన సొంతం. ముఖ్యంగా తాప్సీ వ్యక్తిగత విషయాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు బాలీవుడ్ మీద కూడా తాప్సీ పలు రకాల కామెంట్స్ చేస్తూనే ఉంది.
 

67

వివాదాల నడుమ ఉన్నందుకు తాప్సీకి  కాంట్రవర్సీ క్యూన్ అని, ఫైర్ బ్రాండ్ అని ట్యాగులను కూడా  తగిలించేశారు నెటిజన్లు. ఇక తాజాగా తాప్సీ చేసిన వ్యాఖ్యలు మరోసారి రచ్చ చేస్తున్నాయి. రీసెంట్ గా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది  తాప్సి. ఆఇంటర్వ్యూలో ఆమె  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఇంటర్వ్యూలో తాప్సికి కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా.. సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని బాంబు పేల్చింది.

77

బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొదట్లో చాలామంది ఫోన్ చేసి రాత్రుళ్లు గెస్ట్ హౌస్ కు రావాలని డిమాండ్ చేసేవారని.. నేను రానని చెప్పినప్పటికీ వారు వినేవారు కాదని బాధపడింది తాప్సీ. అలా ఓ ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ చేయకుంటే తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తామని బెదిరించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Recommended image2
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved