మరోసారి రెమ్యునరేషన్ పెంచేసిన నయనతార, ఎంత డిమాండ్ చేస్తుందంటే..?
ఏజ్ బార్ అవుతున్నా.. ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా.. దూసుకుపోతోంది నయనతార. అంతే కాదు రెమ్యూనరేషన విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు.
సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నయనతార. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది బ్యూటీ. అంతే కాదు హీరోయిన్ల కెరీర్ టైమ్ మహా అయితే 30.. అది దాటితే.. 35 వరకూ నెట్టుకుని వచ్చేవారు ఉన్నారు. కాని 40 ఏళ్ళు వస్తున్నా.. హీరోయిన్ గా అదే డిమాండ్ తో దూసుకుపోతోంది నయనతార.
40 దగ్గరలో ఉండి.. ఇంకా అదే డిమాండ్ తో దూసుకుపోతున్న హీరోయిన్లలో.. నయనతార, త్రిష, సమంత ఇలా కొంత మంది మాత్రమే.. ఫిట్ నెస్ తో పాటు ఇమేజ్ ను కూడా కాపాడుకుంటూ.. దూసుకుపోతున్నారు. అంతే కాదు వీరిలో నయనతార ఇమేజ్ ఇంకాస్త ఎక్కువని చెప్పాలి. ఇక రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. రేటు పెంచుతూనే ఉంది.
తాజాగా మరోసారి నయనతార తన రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. జవాన్ సినిమాతో నయనతార మరో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడమే కాదు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఈసినిమా వందల కోట్ల కలెక్షన్ సాధించడం.. షారుఖ్ సరసన ఆమె మెరవడం ఇంకాస్త ప్లస్ అయ్యింది.
ఆమె మార్కెట్ మరింత పెరిగింది. నయనతారను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెళ్ళై పిల్లలు ఉండి.. 40 ఏళ్లు వచ్చినా.. నయనకు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఆమె చిరంజీవి జతగా ఒక సినిమాలో ఎంపికైనట్టు వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. ఇక ఘన విజయం సాధించాయి. దాంతో చిరు సినిమాకు ఇంకాస్త ఎక్కువ డిమాండ్ చేస్తుందట నయన్.
ఇక సౌత్ లో నయనతార మిగతా అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటుంది. ఆమె దాదాపు 8 కోట్ల వరకూ తీసుకుంటన్నట్ట సమాచారం. ఈ విషయంలో అస్సలు తగ్గేది లేదంటుందట నయన్.
ఈక్రమంలో జవాన్ హిట్ అవ్వగం.. బాలీవుడ్ లో క్రేజ్ రావడం.. ఫిట్ , గ్లామర్ గా ఉండటం. ఆమెకు బాగా కలిసి వచ్చింది. అయితే ఆమె వర్కింగ్ స్టైల్ కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది మరి .దాంతో ఇప్పుడు బాలీవుడ్ లోని బడా మేకర్స్ ఆమెను తమ సినిమాలకు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారట.దాంతో ఆమె సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.