Keerthy Suresh: కోటులో సూపర్ హాట్ గా కీర్తి సురేష్... బెడ్ పై వెల్లకిలా పడుకొని కవ్విస్తున్న స్టార్ లేడీ!
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్ కాకరేపుతుంది. నీలి రంగు సూట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. కీర్తి ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Keerthy suresh
ఇక వరుస విజయాలతో జోరు మీదున్న కీర్తి సురేష్ కి భోళా శంకర్ రూపంలో ప్లాప్ పడింది. చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ అనూహ్యంగా చెల్లెలు పాత్ర చేసింది. దర్శకుడు మెహర్ రమేష్ నిరాశపరచగా కీర్తి సురేష్ పాత్ర కూడా తేలిపోయింది.
Keerthy suresh
భోళా శంకర్ మూవీలో చెల్లి పాత్ర కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నారు. సాయి పల్లవికి స్క్రిప్ట్ నచ్చక చేయను అన్నారు. స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉండి కూడా కీర్తి సురేష్ భోళా శంకర్ మూవీ ఒప్పుకుంది. ఫస్ట్ షో నుండే బ్యాడ్ టాక్ తెచ్చుకున్న భోళా శంకర్ యాభై కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది.
Keerthy suresh
అయితే తమిళ చిత్రం మామన్నన్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో నాయకుడిగా విడుదలైంది. ఈ మూవీలో కీర్తి హీరోయిన్ గా నటించింది. ఉదయనిధి స్టాలిన్ కి ఇక్కడ మార్కెట్ లేదు. అందుకే పెద్దగా ఆడలేదు.
Keerthy suresh
అలాగే తెలుగులో ఆమె నటించిన సర్కారు వారి పాట, దసరా భారీ విజయాలు నమోదు చేశాయి. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని కెరీర్లో దసరా బిగ్గెస్ట్ హిట్. దసరా మూవీ కీర్తి సురేష్ కి మరోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది. వెన్నెల పాత్రలో కీర్తి ఒదిగిపోయి నటించింది.
Keerthy suresh
ప్రస్తుతం పలు భాషల్లో అరడజను సినిమాల వరకు కీర్తి చేస్తున్నారు. బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుంది. వరుణ్ ధావన్ కి జంటగా ఓ చిత్రం చేస్తుంది. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారని సమాచారం. ఒకప్పుడు సినిమాకు రెండు కోట్లు తీసుకున్న కీర్తి రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అలాగే కీర్తి రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Keerthy suresh
కీర్తి పాలిటిక్స్ లో వస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై కీర్తి ఆసక్తికరంగా స్పందించారు. వెంటనే రాకపోయినా భవిష్యత్తులో వచ్చే ఆలోచన ఉన్నట్లు ఆమె కామెంట్స్ ఉన్నాయి. ఇక కీర్తి పెళ్లిపై పలు రూమర్స్ వస్తున్నాయి. ఈ వార్తలను కీర్తి పేరెంట్స్ కొట్టేశారు.