పాలిటిక్స్ లోకి అనుష్క శెట్టి..? స్వీటీ చేరబోయే పార్టీ ఏదో తెలుసా..?
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టర్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. చాలా కాలంగా ఖాళీగా ఉంటున్నఆమె.. పాలిటిక్స్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నారట. మరి ఇందులో నిజం ఎంత..?
టాలీవుడ్ తో పాటు.. సౌత్ ఇండియాన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. అరుంధతి, బాహుబలి, భాగమతి, నిశ్శబ్ధం లాంటి సినిమాలు ఆమెను స్టార్ హీరోలను మించి ఇమేజ్ లో కూర్చోబెట్టాయి. ఇక ఆతరువాత అవకాశాలు తగ్గడంతో.. కామ్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది స్వీటీ.
Anushka Shetty
ఇక రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది అనుష్క. అయినా అనుష్క పెద్దగా సినిమాలు లేవు.. ఇక సినిమా కెరీర్ ను వదిలేసి.. హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యిందట అనుష్క. ఇక తాజాగా అనుష్కకు సబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..? అనుష్క పాలిటిక్స్ లోకి వెళ్తున్నారట నిజమేనా..?
Anushka Shetty
ఫిల్మ్ ఇండస్ట్రీకి.. పాలిటిక్స్ కు విడదీయరాని సంబంధం ఉంది.. అది మొదటి నుంచి చూస్తున్నదే.. నటులు, నటీమణులు ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పార్టీ రన్నింగ్ లో ఉండగా.. తమిళనాట స్టార్ హీరో విజయ్ రీసెంట్ గా తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించాడు. తమిళనాడు విక్టరీ కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026 లో పోటీ కూడా చేయబోతున్నారు.
మరోవైపు నటి అనుష్క శెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందటూ ఓ న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో దావానలంలా వ్యాపిస్తోంది. అయితే ఆమె ఏ పార్టీలో చేరతారు.. పోటీ చేస్తారా లేదా అనే విషయంలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో ఆమె ఆంధ్రాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరతారని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
Pawan Kalyan, Janasena
అంతే కాదు వైసీపీ నుంచి మాజీ హీరోయిన్ రోజా ఎమ్మెల్యేగా, మినిస్టర్ గా ఉన్నారు. నగరి నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు. కాగా ఈ నియోజకవర్గంలో తమిళ, కన్నడ ప్రభావిత జనాలు ఎక్కువగా ఉండటంతో.. అనుష్కను నగరి నించి పోటీలో ఉంచబోతున్నారా అని నెట్టింట చర్చిచుకుంటున్నారు.
సినీరంగంపై ఆసక్తి తగ్గిన నటి అనుష్క రాజకీయాల్లోకి దూకాలని నిర్ణయించుకుంది. జనసేన పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో అనుష్కను నిలబెట్టేలా చర్చలు జరుగుతున్నాయట. అయితే ఈ విషయంలో నిజం ఏంటో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈన్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇది నిజం అయితే.. అఫీషియల్ గా వారు స్పందించాల్సి ఉంది.