- Home
- Entertainment
- Jr Ntr: సినిమా ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ పరిస్థితి ఇదే.. ఆ భయం ఇప్పటికీ వెంటాడుతుందా?
Jr Ntr: సినిమా ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ పరిస్థితి ఇదే.. ఆ భయం ఇప్పటికీ వెంటాడుతుందా?
ఎన్టీఆర్ సక్సెస్ ఫెయిల్యూర్ గురించి రియాక్ట్ అయ్యారు. సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా తనకు ఒక్క రోజు మాత్రమే అని తెలిపారు. అంతకు మించి అది తనని ప్రభావితం చేయదని వెల్లడించారు.

డ్రాగన్‌తో రాబోతున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. సక్సెస్ రేట్ చాలా తక్కువే. కానీ ఒక్క హిట్‌తో మరో స్థాయికి వెళ్లిపోతున్నారు. `ఆర్ఆర్ఆర్`తో ఆయన పాన్ ఇండియా హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ రాణిస్తున్నారు. అందులో భాగంగా `డ్రాగన్` చిత్రంలో నటించారు. ఇది వచ్చే ఏడాది రాబోతుంది. చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. యంగ్ హీరో అనీష్ నటించిన `ఇట్లు అర్జున్` సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా తన ఫెయిల్యూర్ గురించి ఓపెన్ అయ్యారు.
సినిమా ఫెయిల్యూర్ అయితే ఎన్టీఆర్ ఏం చేస్తాడంటే?
తన ఫెయిల్యూర్ గురించి చెబుతూ, పరాజయాలు వచ్చినప్పుడు బాధపడతాను, కాకపోతే ఆ ప్రభావం ఒక్క రోజే ఉంటుంది, అంతకు మించి బాధపడతాను. ఆ తర్వాత రోజు నుంచి నార్మల్ అయిపోతాను, పనిలోకి వెళ్లిపోతాను, ఎక్కువగా ఆలోచించను అని తెలిపారు ఎన్టీఆర్. సక్సెస్ ఫెయిల్యూర్స్ తనని పెద్దగా ఎఫెక్ట్ చేయవని తెలిపారు. సక్సెస్ ల విషయంలోనూ తాను అంతే అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ సందర్బంగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మొదటి సినిమా అనుభవాన్ని తాను మర్చిపోలేను అన్నారు. ఆ మూవీ వస్తుందంటే, టెన్షన్‌గా ఉంటుందని, ఇప్పటికీ నర్వస్‌గా ఫీలవుతానని వెల్లడించారు. ఇప్పటికీ తెలియని టెన్షన్ ఉంటుందని చెప్పారు.
వరుస లైనప్‌లో ఎన్టీఆర్
ఎన్టీఆర్ `నిన్ను చూడాలని` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. `స్టూడెంట్ నెం 1` సినిమాతో హిట్ అందుకున్నారు. అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక `సింహాద్రి`తో బిగ్ బ్రేక్‌ని అందుకున్నారు. ఆ తర్వాత `యమదొంగ`, `అదుర్స్`, `బృందావనం`, `టెంపర్`, `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్`, `జై లవకుశ`, `అరవింద సమేత`, ఆర్ఆర్ఆర్`, `దేవర` చిత్రాలతో విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్‌తో `ది గాడ్ ఆఫ్ వార్`, అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయనున్నట్టు సమాచారం.













