MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Casting Couch:అవకాశాల ఇస్తామని అమ్మాయిలను లోబరుచుకుంటారు... నేను కూడా చూశాను.. అనుష్క డేరింగ్ కామెంట్స్

Casting Couch:అవకాశాల ఇస్తామని అమ్మాయిలను లోబరుచుకుంటారు... నేను కూడా చూశాను.. అనుష్క డేరింగ్ కామెంట్స్

స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty)పరిశ్రమకు వచ్చి 17ఏళ్ళు అవుతుంది. నాగార్జున హీరోగా 2005లో విడుదలైన సూపర్ ఆమె మొదటి చిత్రం. వివాదాలకు దూరంగా ఉండే అనుష్క ఇన్నేళ్ల కెరీర్ లో విమర్శలపాలైన సందర్భాలు లేవు. ఒకటి రెండు లవ్ ఎఫైర్  రూమర్స్ వచ్చినా... అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 16 2022, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక దర్శక నిర్మాతలు తోటి నటులు ఆమెను ఎంతగానో ప్రేమిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆమె గుణం, అందరూ ఇష్టపడే హీరోయిన్ గా మార్చింది. డిమాండ్ ఉన్నా రెమ్యునరేషన్ విషయంలో కూడా అనుష్క చాలా ఫెయిర్ గా ఉంటారు.నిర్మాతలు వెంటబడుతున్నారు కదా అని ఎక్కువ డిమాండ్ చేయరు.

26


ఇక పాత్రల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటారు. బాహుబలి తర్వాత అనుష్క సినిమాలు తగ్గించారు. ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం. ఈ మూవీలో ఆమె మూగ అమ్మాయి రోల్ చేశారు. మాధవన్  కీలక రోల్ చేసిన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. 
 

36
Anushka Shetty

Anushka Shetty

ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 

46

టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ (Casting couch)ఉందని ఆమె ఒప్పుకోవడం గమనార్హం. అవకాశాలు ఆశచూపి అమ్మాయిలను లొంగదీసుకునే విష సంస్కృతి టాలీవుడ్ లో కూడా ఉంది. కెరీర్ బిగినింగ్ లో నేను కూడా చూశాను. అయితే నేను ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉంటాను. కరెక్ట్ గా మాట్లాడతాను, కాబట్టి ఈ ఇబ్బందులు నాకు ఎదురు కాలేదు. నా మనస్తత్వం తెలిసి, నా దగ్గరకు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు.

56


ఒక్క చిత్ర పరిశ్రమలోనే కాదు, చాలా రంగాల్లో అమ్మాయిలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు.  క్యాస్టింగ్ కౌచ్ పై అనుష్క చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. ఎవరు కాదన్నా ఔనన్నా క్యాస్టింగ్ కౌచ్ దశాబ్దాలుగా పరిశ్రమలో పాతుకుపోయిన సమస్య. సోషల్ మీడియా ప్రభావం, ఆడవాళ్లు బయటికొచ్చి మాట్లాడే ధైర్యం చేయడం వలన ఈ క్యాస్టింగ్ కౌచ్ బాగోతాలు బయటికి వస్తున్నాయి. 
 

66
Anushka Shetty

Anushka Shetty

చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి వేధింపులకు గురైనవారే. ఓ స్థాయి గుర్తింపు వచ్చే వరకు ఇలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ వేధింపులకు బలైన వర్థమాన నటీమణులు ఎందరో ఉన్నారు. చాలా మంది కనీస గుర్తింపుకు నోచుకోకుండానే పరిశ్రమ నుండి కనుమరుగవుతారు. ఓ స్థాయికి చేరిన హీరోయిన్స్ కెరీర్ నాశనం అవుతుందని క్యాస్టింగ్ కౌచ్  గరించి కామెంట్స్ చేయరు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
Recommended image2
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్
Recommended image3
చిరంజీవి దెబ్బకు యుఎస్ లో రికార్డులు గల్లంతు.. బాలకృష్ణ, ప్రభాస్ సినిమాలకు చుక్కలు చూపించేలా కలెక్షన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved