ప్రాణం పెట్టినా.. స్టార్స్ కష్టానికి ఫలితాన్ని ఇవ్వని సినిమాలు
First Published Aug 19, 2019, 12:37 PM IST
ఒక సినిమా అంటే ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు కొన్నిసార్లు సినిమా మీద నమ్మకంతో ప్రాణం పెట్టి కష్టపడతారు. అయినా కూడా కొన్ని సార్లు ఫలితం దక్కదు. ఆ విధంగా దెబ్బ కొట్టిన సినిమాలపై లుక్కేద్దాం పదండి.

ఐ - మనోహరుడు: విక్రమ్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కోసం విక్రమ్ ఏ స్థాయిలో కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా కోసం దాదాపు తన ప్రాణాలని పణంగా పెట్టి 40కేజీలు తగ్గి కొన్ని రోజుల పాటు ఒక యాపిల్ తోనే కడుపు నింపుకున్నాడు. అయినా సినిమా అనుకున్నంతగా సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.

లడ్డుబాబు: అల్లరి నరేష్ కెరీర్ లోనే ఒక డిఫరెంట్ ప్రయత్నం లడ్డు బాబు. రవి బాబు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోసం నరేష్ భారీ ప్రాస్తటిక్ మేకప్ వేసుకొని కొన్ని వారాలపాటు కష్టపడ్డాడు. అయినా కూడా సినిమా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?